పుట:2015.393685.Umar-Kayyam.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

101

394

వయసను భూరుహంబు తలవాల్చిన నేలకు శాఖలట్టు నె
మ్మెయిఁ దన కాళ్ళు, చేతులును, మేనును వంగి నశించు ; నావలన్
దయఁగని నాదుబూడిదను దద్దయు భాండముఁజేసి యందులో
స్వయముగఁ గల్లుపోసినను బ్రాణమువచ్చు నిజంబు నెచ్చెలీ !

395

మరణరహస్య మెప్పుడును మద్యము ద్రావెడువాఁ డెఱుఁగు ; నీ
సుర, సురపాత్రలో మహిమ శుద్ధదరిద్రుఁడెఱుంగుఁ గాని నీ
వెఱుఁగవు మమ్ము మాతెఱఁగు నీకనుదమ్ములు చూడగల్గునే
మఱి తగవేల ? మత్తులను మత్తులెగాని యెఱుంగనేర్తురే !

396

ఈ వసంతంబులో సురఁద్రావు ; మేదొ
ప్రియను దలపోసి త్రావు మైరేయ ; మిదియు
ద్రాక్షరక్తంబు, తనరక్తదాహమునకు
వగవ నని చెప్పు నదె త్రావవగవ కింక.

397

తిరిగి కర్మబాహ్యులఫక్కి మరగినాము
జపతపంబులపై మట్టి చల్లినాము
ఎచట మధుపాత్ర యుండునో యచట మేము
కలశమట్టుల తలవంచి నిలుతు మెపుడు.