పుట:2015.373190.Athma-Charitramu.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14. వైష్ణవ క్రైస్తవమతములు 53

బ్రియగురువు లైరి. మే మపుడు నివసించుకొట్లదగ్గఱ నొక గృహమున వారు కాపుర ముండుటచేత, తఱచుగ నేను వారిని సందర్శించుచు వచ్చితిని. క్రైస్తవుఁడగు నాయన, ఏతన్మతప్రాశస్త్యమునుగూర్చియు బైబిలునుగుఱించియు నాతోఁ బ్రసంగించుచుండువాఁడు. నావిద్యారోగ్యాభివృద్ధులనుగూర్చి యాయన పలుమారు సదాలోచనలు చెప్పెడి వారు. క్రైస్తవమతస్వీకారము చేయుమని మాత్ర మెన్నఁడును వారు నాకు బోధింపలేదు. అంతియ కాదు. కొన్ని సమయములందు క్రైస్తవమతస్వీకారావశ్యకతనుగూర్చి నేను గ్రుచ్చిగ్రుచ్చి యడుగఁగా, పరమాత్ముఁడు కోరునది హృదయపవిత్రతయేగాని, బాహ్యవేషాదులు గావని యాయన నన్ను హెచ్చరించుచుండువాఁడు. గతసంవత్సరమున నాతో కోనసీమ కేతెంచినస్నేహితుఁడు కారణాంతరములచే క్రైస్తవమతస్వీకారము చేసెద నని నన్ను వేధింపఁగా, నేను 4 వ ఆగష్టుతారీఖున వెంకటరత్నముగారియొద్ద కాతనిని గొనిపోయితిని. ఈవిషయమై వారియమూల్యాలోచన లడుగఁగా, ఆయువకుఁడు క్రైస్తవమతస్వీకారము చేయుట కాయన సమ్మతింపలేదు. అంత నేను క్రైస్తవమతమునుగుఱించి నాయభిమానమును మాగురువునకుఁ దెలిపితిని. నేను నిత్యమును బైబిలుపారాయణము చేయుచు, జీససు బోధన ననుసరించి దైవప్రార్థనలు సలుపుచుంటి నని చెప్పినప్పుడు, అట్టివారలే నిజమైనక్రైస్తవు లని నన్ను వెంకటరత్నముగారు అభినందించి, నా కమితోత్సాహము గలిగించిరి.

నే నిట్లు క్రైస్తవమతావలంబకుఁడను గాకున్నను, క్రైస్తవారాధనయు క్రైస్తవాచార సంప్రదాయములును నా కెంతో రుచికరము లయ్యెను. ప్రపంచమున విస్తరిల్లెడి ప్రకృతిశాస్త్రజ్ఞానాదిశుభముల కెల్ల క్రైస్తవమతమే మూలాధార మని నేను నమ్మి,