పుట:2015.373190.Athma-Charitramu.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

9. కళాశాలలో ప్రథమవత్సరము 33

యందు ప్రథమతరగతిలో జయ మందినది మే మిద్దఱమే. కాని, అతనికి నాకును పెక్కుస్థానముల యంతరము గలదని, యిప్పటివఱకును నాకు జ్ఞాపకము !

ముఖ్యప్రాణరావు బుద్ధివైశద్యమున నసమానుఁడని లోక మెఱుఁగును గాని, ఏ తద్విద్యాపరిశ్రమమునకై దేహారోగ్యమును యౌవనముననే ధారవోసిన దురదృష్టవంతుఁడని యెవరికిని దెలియదు. కళాశాలలో నొకవత్సరము చదువకమునుపే, ఆ సుకుమార శరీరుఁడు అనివార్యరోగపీడితుఁడై మృత్యువువాతఁ బడెను. వానితో సరిసమానమగు మేధాశక్తి గల రామయ్య యను మా యింకొకసహపాఠిని గూడ, ఆదినములలోనే మృత్యుదేవత తనపొట్టఁ బెట్టుకొనెను. ఈ యనుంగునేస్తుల యకాలమరణముఁ గాంచి నే నతివ్యాకులచిత్తుఁడ నైతిని. ప్రజ్ఞాన్వితు లగు నిట్టి ప్రియమిత్రులను బాసి, పాడువడిన యీపుడమిని దినములు గడుపుట దుస్సహముగఁ దోచెను.

ఇట్లు తోఁచినది నా కొక్కనికే కాదు. నా మిత్రవర్గమున నందఱు దుర్భరవిషాదమునకు లోనయిరి. నన్నుఁ బొడగాంచిన సహవాసులు, "రామయ్యముఖ్యప్రాణుల సంగతి చూచితివిగదా. నీరసస్థితిలో నున్న నీ వారోగ్యమును గాపాడుకొననిచో, వారివలనే చేటు తెచ్చుకొనెదవుసుమీ !" యని యాత్రమున నన్ను హెచ్చరించుచుండువారు. నిజముగ, కళాశాలఁ జేరిననాఁటనుండియును దేహమున నాకు సపిగా లేదు. ఉష్ణాధికతచేతను, పైత్యప్రకోపమువలనను, తఱచుగ నాకుఁ దలనొప్పులు వచ్చుచుండును. ఉన్నటులుండి యాకస్మికముగఁ గనులు చీఁకటులు గ్రమ్మును. లోక మంతయు దిర్ధిరఁ దిరుగునట్లు దోఁచును. తోడనే తలనొప్పి తలచూపి, దిన మంతయు నన్ను వేధించును. కడుపులో వికారముగ నుండును. ఇవి యన్నియు ధాతుదౌర్బ