పుట:2015.373190.Athma-Charitramu.pdf/664

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 622

జననీజనకులు పరిపూర్ణామోదమున జరిపి, యీసంస్కరణమును జయప్రదముగఁ జేయవలసిన సమయము వచ్చినది.

హిందూసంఘశ్రేయోభివృద్ధికి హరిజనోద్ధరణ మత్యంతావశ్యకమని ప్రప్రథమమునుండియు నే నెంచువాఁడను. గాంధిమహాత్ముఁడు, మాళవ్యాపండితుఁడు, బిర్లామహాశయుఁడు మున్నగు దేశనాయకు లిటీవలఁ గావించిన ప్రబోధమహిమమున, భారతీయులహృదయములం దిపుడు ప్రబలసంచలనము గలిగెను. అస్పృశ్యతాభిమాన దాస్యము నుండి దేశమాత విముక్తినొందు విషయమున దేశారాధకులు సల్పు ప్రచారమున నేనును గొంత పాల్గొనుచు వచ్చితిని.

స్వకీయాదర్శానుసారణముతోపాటు పరుల విశ్వాసములపట్ల సహనగౌరవములు నే నలవఱుచుకొంటిని. తాను హిందూమతాను గుణ్యమగు భక్తి గలిగి, సంఘసంస్కరణవిషయమున నానాట సానుభూతు గాంచి, నాభార్య తోడిస్త్రీల హృదయసీమల విశాలభావములు వెలయించుట కిటీవల కొంతకాలమునుండి కృషి సల్పుచుండెను.

విద్యాబోధకవృత్తిని గూర్చిన నా యభిప్రాయానుభవముల నించుక ప్రస్తావించెదను. చిన్న నాఁడు నే ననుకొనినట్టుగ పాఠశాలావరణమునకు వెలుపలిప్రదేశము పాపభూమి కాదనియు, వృత్తులందు పవిత్రత్వాపవిత్రత్వములు నియతములు కావనియు, సంకల్పశుద్ధియె సామాన్యముగ నేకార్యప్రాశస్త్యమునుగాని నిర్ణయించుననియునా నాట నాకు నచ్చెను. లోకములోవలెనే బోధకలోకమందును మేకవన్నె పులులు లేకపోలేదు. కామి, పరుల సంకుచితాశయములు పామరకృత్యములు నొరవడిగఁ గైకొనవలదని సదా నేను మానసబోధ గావించుకొనువాఁడను. కీర్తిధనాదులనుపరమావధిగ నెంచక, వృత్తి నిర్వహణమె