పుట:2015.373190.Athma-Charitramu.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5. మరల బెజవాడ 231

విద్యార్థులను గుఱించిన ముఖ్యమగుసంగతులు కొన్ని చర్చించుకొంటిమి. శిష్యులందుఁగల దురభ్యాసములు నిర్మూలించుటకును, మరల నుత్సాహముతోఁ బనిచేయుటకును, మేము దృఢసంకల్పులమైతిమి.

23 వ తేదీని "నీతిధైర్యము"ను గుఱించి నేనింట మాటాడితిని. కష్టము లాపాదించిన తరుణమున ధృతిఁ దొఱఁగకుండ నిలువవలయునే కాని, అవి తొలఁగిపోయినపిమ్మట ధైర్యమూనిన లాభ మేమి యని పలికిన సతిపలుకులందు సునిశిత సత్యవిచక్షణశక్తి నాకుఁ గానఁబడెను.

25 వ తేదీని మద్రాసునుండి రాజమంద్రి వెడలిపోవుచుండు వీరేశలింగముగారిని, వారిభార్యను, నేను రెయిలు స్టేషనులోఁ గలసి కొంటిని. నే నంత వారితో కనకరాజు మున్నగు మిత్రవర్గమునకు నన్ను గుఱించి కలిగిన దురభిప్రాయములను గూర్చి ప్రస్తావించితిని. తనకును నామీఁద నిటీవలఁ బొడమిన సందియముల నాయన యేకరువు పెట్టెను. ఆయనపలుకులవలన నా కేమియు నోదార్పు గలుగలేదు!

రాజమంద్రినుండి వచ్చిన వారమునకు నా తమ్ముఁ డొక యుత్తరము వ్రాసెను. నేను బెజవాడకు బయలుదేఱిన రెండురోజులకు కనకరాజు రాజమంద్రి వచ్చి, మార్చి యేప్రిలు నెలల సత్యసంవర్థనీపత్రిక మొదటి ఫారములో నేను అచ్చొత్తించిన "వార్తలు: అభిప్రాయములు" అను శీర్షికతోఁ జివర నింగ్లీషున నేను వ్రాసిన భాగము మాననష్టమున కెడ మిచ్చు ననియు, అందు నేను మహాపవిత్రుఁడ ననియు, నితరులు దుర్మార్గు లనియు సూచించితి ననియును, వీరేశలింగముగారు రాజమంద్రి వచ్చువఱకును ఆపత్రిక ప్రకటింపవలదనియును స్నేహితులతోఁ జెప్పెనఁట ! నేనీ వార్తను విని మిగుల