పుట:2015.373190.Athma-Charitramu.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 220

ప్రముఖము లని నేను గనిపెట్టి, వీనిని సవరించి నా కాత్మవికాసము గలిగింపు మని పరాత్పరుని వేఁడుకొంటిని. లోకమందు భక్తులచిత్తములు నిరతము భగవదున్ముఖములగుచుండఁగా నాకుమాత్రము లోక విషయములె మఱింత హృదయరంజకము లగుచుండుటకు నే నెంతయు విషాదమందితిని !

2. ప్రార్థనసమాజము

రాజమంద్రి ప్రార్థనసమాజవార్షిక సభకు నా కిపుడు పిలుపు రాఁగా, ఆసందర్భమునఁ జదువుటకై "ఆస్తికమతాధిక్యము" అనునొక యాంగ్లోపన్యాసమును నేను సిద్ధపఱిచితిని. ఏప్రిలు 6 వ తేదీని నేను రాజమంద్రి వెళ్లితిని. మాయమ్మ యపు డారోగ్యవతిగ లేదు. మఱునాఁటిప్రొద్దున తమ్ముఁడు వెంకటరామయ్య యుపన్యాసము జరిగెను. ఆ సాయంత్రము నేను బ్రసంగించితిని. పలువురు సభికులు నా యుపన్యాసమును మెచ్చుకొనిరి. అందలి ముఖ్యవిషయము లిందుఁ బొందుపఱుచుచున్నాను : -

"ప్రార్థంసమాజమువారిమతము ఆస్తికమత మనియు, వారి యర్చనల కధిదేవత పరమాత్ముఁ డనియు నుడువనగును. ఇతరమతములకును దైవమే ముఖ్యమైనను, అవి యామహామహునికంటె నాతని యవతారములకును, ప్రవక్తలకును, ప్రతినిధులకును ప్రాధాన్య మొసంగుచున్నవి. పరిశుద్ధాస్తికమతమునకు మాత్రము దైవభక్తియె ప్రధానాంగము. దీనికి గొప్ప సిద్ధాంతగ్రంథములతోఁ బ్రసక్తి లేదు. మనష్యుని బాహ్యాంతరప్రకృతులే దేవదేవుని యునికికి సాక్షీభూతములు. జగత్తె యీశ్వరనిర్మితమగు దివ్యభవనము. మనస్సాక్షి మానవచారిత్రాదు లాస్తిక్యమునకు ముఖ్యనిదర్శనములు. పాప మనఁగ