పుట:2015.373190.Athma-Charitramu.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1. బెజవాడ 219

సంస్కరణ విషయములను సతితోఁ జర్చించుచును, తీఱిక సమయములం దుత్తమవిషయములనుగుఱించి సంభాషించుచును, ప్రొద్దుపుచ్చుండు వాఁడను.

ఉద్యోగమునఁ బ్రవేశించినను నా వృత్తిసమస్య యింకను పరిష్కారము కానివిధముననే, మతమునుగుఱించి బాహాటముగ ప్రసంగములు సల్పుటకును వ్యాసములు వ్రాయుటకును నే నేర్చి యుండినను, నా విశ్వాసము లింకను జీవితమునఁ బెనఁగలసి, క్రియా రూపమున వెలువడ నేరకుండెను! ఒక నిముసమున నధిక పవిత్రస్థానము నధివసించెడి నాహృదయము, మఱుక్షణముననే హేయవిషయ వాంఛల నోలలాడుచుండును ! ఈశ్వరచరణకమల ధ్యానమే జీవిత కర్తవ్య మని నమ్మిననామనస్సు, పలుమాఱు విషయలాలసా పంకమున బ్రుంగుచుండెడిది ! తప్పించుకొనఁ బ్రయత్నించినకొలఁది కామోపభోగములందు నా మనస్సు మఱింత గాఢముగఁ గూరుకొనిపోవు చుండును ! ఒకనాఁటి మనోనిశ్చయము మఱునాఁటికి హాస్యాస్పదమగుచున్న దనియు, ఈ చిత్తచాంచల్యమునుండి నన్నుఁ దప్పింపు మనియు, దైన్యమున నే నెంతవేఁడుకొనినను, దీనరక్షకుఁడగు దైవము నా మొఱలు వినిపించుకొనక, చెవులు మూసికొని కూర్చుండునట్లు తోఁచెను !

మార్చినెల తుదిదినములలో నొకసాయంకాలము, మరల తన పుస్తకములు విప్పి యాంగ్లము నభ్యసింపుమని భార్యకు బోధించి, నేను బందరుకాలువయొడ్డున షికారుచేయుచు, నాప్రకృతదురవస్థను జ్ఞప్తికిఁ దెచ్చుకొని, నన్ను రక్షింపు మని దేవదేవుని వేఁడుకొంటిని. నామానసిక స్థితినంత నేను విమర్శించుకొంటిని. నా లోపపాపములలో, అసూయ, విషయవాంఛ, నిగ్రహరాహిత్యము, అసమగ్రభక్తియును