పుట:2015.373190.Athma-Charitramu.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 154

మద్రాసు పోయి వచ్చినప్పటినుండియు నాకు వ్రాతఁపని వెంటఁబడెను ! అందువలనఁ గనులమంటలు హెచ్చెను. 4 - 6 - 91వ తేదీని నేను వీరేశలింగముపంతులుగారి యింటికిఁ బోయి, రాజ్యలక్షమ్మగారు జబ్బుగ నుండి రని తెలిసి, ఆమెను జూచితిని. అపుడె శరీరము నెమ్మదిపడుచుండెడి యాయిల్లాలు కుశలప్రశ్నము చేయఁగా నా కనుల సమాచారము తెలిపితిని. దీని కామె విచారపడి, పెద్దచెరసాలలో వైద్యులగు రంగనాయకులనాయుఁడుగారు కంటివైద్యములో మంచి సాధకులని పలికి, పంతులుగారి ద్వారా వారి నెఱుకఁజేసికొని వారిసాయము పొందు మని నా కాలోచన చెప్పిరి.

ఆనెల 17 వ తేదీని నేను పంతులుగారిని సందర్శించినపుడు, ఆయన తన "ఆంధ్రకవుల చరిత్రము"ను పూర్తిచేయుటకై యాఱు నెలలు సెలవుతీసికొని చెన్నపురిలో నుందు మని చెప్పిరి. ఆసందర్భమున నాకనులసంగతి వారితోఁ బ్రస్తావించి, రంగనాయకులు నాయఁడు గారియొద్దకు నన్నొకమాఱు కొనిపొం డని వారిని గోరితిని. అందుకు వారు సమ్మతించిరి.

21 వ జూలై తేదీని పంతులుగారు నేనును కారాగారమునొద్దకుఁ బోయితిమి. అపుడు నాయఁడుగారు రోగులకు మందుచీ ట్లిచ్చుచుండిరి. కుర్చీ కొకపెడ నిలిచి, ఖైదీ యొకఁడు విసనకఱ్ఱ వేయుచుండెను. నాయఁడుగారు స్థూలకాయులును, మంచి యొడ్డుపొడుగు గలవారును. మందహాసము చేయునపుడు, సహజసౌజన్యము వారి వదనకమలము నుండి వెల్లి విఱిసి నలుదెసలను బ్రసరించునటు లుండెను. ఆయన పంతులుగారిని ప్రేమపూర్వకముగ సమ్మానించెను. కుశలప్రశ్నము లైనపిమ్మట, వీరేశలింగముగారు నన్ను గుఱించి నాయుఁడుగారితోఁ జెప్పిరి. నాకనులు చూచి, నేను కొంతకాలము చదువు విరమించుట