పుట:2015.373190.Athma-Charitramu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లై సంసిద్ధిని బడయుట కవకాశములను నధికారమును గలిగియున్నారు.

పరమాణువునుండి పరబ్రహ్మమువరకును వ్యాప్తమైన విశ్వమంతయును విశ్వపరిణామమునకు వినియోగ పడుచున్నది. మహాపురుషులజీవితములవలె సామాన్యులజీవితములును విశ్వకల్యాణమునకు మంగళహారతులను సమర్పించుచు విశ్వవికాసమునకు వినియోగపడుచున్నవి. విశ్వయాత్రయందు వ్యక్తులజీవయాత్ర లన్యోన్యాశ్రయములై వికాసమును బొందుచున్నవి.

జీవయాత్రల యుపయోగానుపయోగములు, గుణావగుణములు, మహత్త్వాల్పత్వములును, సాపేక్షములు కాని నిరపేక్షములు కావు. బుద్ధివైభవమునందును, ధైర్యసాహసములందును, గుణశీలములందును, దాన ధర్మములందును, దైవభక్తియందును, సిరిసంపదలందును, విద్యావినయములందును, ప్రవృత్తినివృత్తిమార్గములందును మానవులకుగల భేదములు సాపేక్షములు. మహాపురుషుల జీవితములందువలె సామాన్యజనుల జీవితములందును సుగుణవిశేషములు సహజములు.

అవకాశాధికారములుగల జనులు వారి జీవిత విశేషములను లోకమునకు విశదముచేయుట పురుషలక్ష