పుట:2015.373190.Athma-Charitramu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరిచయవాక్యము

ఆత్మచరిత్రలు, ఆత్మకథలు, స్వీయచరిత్రలు సకల జనులకును సహజములు. జీవితయాత్ర మానవులకు పురుషార్థసిద్ధికి సాధనము. జీవయాత్రయందు జన్మ సంస్కారము కర్మసంస్కారమూలమునను, ధర్మసంస్కార సాధనమునను పరిపక్వము నొందుచు, పురుషార్థమునకు సాధనమగుచున్నది. ప్రపంచమునందు కులీనులు, శ్రీమంతులు, బలవంతులు, పండితులు, వీరులు, శాస్త్రజ్ఞులు, మతాచార్యులు స్వీయచరిత్రకథనమున కధికారులుగ పరిగణింపబడుచున్నారు. జీవయాత్రయందు సుఖదు:ఖములు, లాభనష్టములు, జయాపజయములు, రాగద్వేషములు, జాతి కుల మత దశాభేదములును లేక సకలజనులకును సంభవములు. జీవయాత్రయందు సుఖదు:ఖములు, లాభనష్టములు, హెచ్చుతగ్గులు, ప్రియాప్రియములు, జయాపజయములు, ఆనందవిషాదములును, పండితపామరులకు, ధనినిర్ధనులకు, సవర్ణావర్ణులకు, గురుశిష్యులకు, స్వామిభృత్యులకు, స్త్రీపురుషులకు, బాల వృద్ధులకును సహజావస్థలు. సకలజనులును స్వకర్మ నిరతు