పుట:2015.372412.Taataa-Charitramu.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

9. బట్టలపన్ను.

దూది నూలుబట్టల వ్యాపారసందర్భమున, అప్పుడింకొక సమస్యకూడ గల్గెను; అందును దేశీయపరిశ్రమల క్షేమముకై తాతా తీవ్రకృషి సలిపెను.

1892 ప్రాంతముకు మనప్రభుత్వపు సేనాదులు వృద్ధి చేయబడెను; అందుకు సాలీనావ్యయము అధికమగుచుండెను. అంతవరకున్న పన్నులయాదాయము ప్రభుత్వముకు చాలలేదు. అప్పుడు, హర్షల్‌ప్రభువు అధ్యక్షతను, మనప్రభుత్వమొక కమిటీనేర్పర్చిరి. వారు పరిస్థితుల విమర్శించి, ప్రభుత్వాదాయపు వృద్ధికై, మనదేశముకు దిగుమతియగు సరుకులన్నిటిపైన సుంకముల విధింపవలెనని తమరిపోర్టులో దెల్పిరి. ఆప్రకారము దిగుమతుల కిమ్మతుపై నూటి కైదుచొప్పున (1894 లో) భారత ప్రభుత్వమువారు సుంకము విధించిరి.

అప్పటికి మనకు దిగుమతియగు సరుకులన్నిటిలో ముఖ్యమైనవి బ్రిటిషువారి మిల్లుల నూలు, బట్టలు; వానికిని ఈదిగుమతిపన్ను తగిలినది. ఈసరుకులను మనదేశముకంపి బ్రిటిషువా రందుపైన సాలీనా కోట్లకొలది రూపాయల లాభమొందుచున్నారు. ఈదిగుమతిపన్ను వలన యాసీమసరుకుల ధర యిచ్చటకొంచముగ హెచ్చునని, అందుచే నీదేశపు మిల్లుబట్టలకు ధరలో సదుపాయము కలుగునని, అందువలన తమసరుకుల యమ్మకము తగ్గవచ్చునని, అట్లగుచో తమ కంతవరకు వచ్చు