పుట:2015.372412.Taataa-Charitramu.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తరువాత కొలదికాలముకే తాతా చెప్పినదంతయు మిల్లుదార్లందరకనుభవముకు వచ్చెను; మిల్లులు వృద్ధియై, బొంబాయి ప్రాంతమున కార్మికుల గిరాకి చాలహెచ్చెను. కూలీలు చాలక, మిల్లుపనిలో చాల చిక్కులు కల్గెను. ఆ మిల్లుదార్లప్పుడు తాతా దూరదృష్టికి విస్మితులైరి; ఆయవకాశమును గోల్పోయినందుకు, తాతా సలహా విననందుకును, వారు తరువాత విచారించిరి.


__________