పుట:2015.372412.Taataa-Charitramu.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బొంబాయి తరువాత మనదేశమున హెచ్చుమిల్లులు గుజరాతులోని అహమ్మదాబాదుపురమం దేర్పడినవి. అచటి మిల్లులకు మార్గదర్శకమగుటకు జంషెడ్జితాతా అహమ్మదాబాదులోను ప్రశస్తమగు మిల్లును పెట్టదలచెను. అందుకై, ఆపురమందలి 'అడ్వాన్సుమిల్లు' అను ప్రాచీనపద్ధతి మిల్లు నొక దానిని కొని, దానియంత్రములగూడ పూర్తిగామార్చి, మాంచస్టరుమిల్లురీతిగ జేసెను. 12 ఏండ్లు అపారకృషిచేసి తాతా యామిల్లులను, ఆపరిశ్రమను, ఉచ్చస్థితికితెచ్చి, లాభకరముగ జేసెను.

మనదేశమందలి మిల్లుల యేజెంట్లు ఆమిల్లులందు ఎంత సరుకు తయారగునో దాని అంతటి కిమ్మతుమీదను నూటి కింత యని 'కమిషను' సొమ్ము తీసుకొనుట రివాజు అయినది. ఆ సరుకులు సరిగా అమ్మకము కాకున్నను, కంపెనీ వాటాదార్లకు లాభము రాకున్నను, సరుకులు తయారైనంతనే ఆసరుకుల కిమ్మత్తుకు తగిన కమిషను ఏజెంట్లకు ముట్టును. అందుచే నా మిల్లుల నడుపు ఏజెంట్లు సరుకుల హెచ్చుగ తయారుచేయుట యే ముఖ్యముగ గమనింతురు; కాని ఆసరుకులు దేశమున విడుదలయగుటకు, అవి లాభకరముగ నుండుటకు తగుశ్రద్ధ వహింపరు. ఈపద్ధతి మిల్లుల వాటాదార్లకు జనులకు గూడ తుదకు అనర్ధకమగునని తాతా కనిపెట్టి, తాను ఏజెంటుగా నడుపు మిల్లులలో అట్టిపద్ధతిని తొలగించెను. కంపెనీకివచ్చు