పుట:2015.372412.Taataa-Charitramu.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రు*[1] మరియు చీనాకు జపాను చాలదగ్గర; ఆరెండుదేశములవారు నేకజాతీయులు. జపానీయులు సులభముగ చీనాలో వసించుచు, అచటిజనులకు రుచించు రకముల వస్త్రములదెచ్చి, అందు వ్యాపింపజేయుదురు. ఇట్లు మనదేశమునుండి జపానుకుండిన యెగుమతి నిల్చిపోవుటయే గాక, జపానుతో పోటీచే, చీనాకును మన బొంబాయిబట్టల యెగుమతి క్రమముగా తగ్గు చుండెను. కొంతవరకు తూర్పుఆఫ్రికా పారసీకములందు బొంబాయిబట్టలకు చలామణి యుండెను. కాని అచటను క్రమముగ పోటీ కలుగవచ్చును. విదేశముల కొనుబడిపైననే ఆధారపడు వ్యాపారము ఎన్నడును సందిగ్ధమే. అందుల ఆధారము నేనమ్మి పరిశ్రమల వృద్ధిజేయుట భావ్యముకాదు. మనదేశీయుల కిష్టమగు సన్నబట్టలనే మన మిల్లులందు తయారుచేయుట క్షేమకరము. అందుచేత మనవ్యాపారముకు నిలుకడగల్గును. నిత్యావసరములగు బట్టలకై పరదేశాధీనత తొలగును; మన దేశీయులును బాగుపడుదురు. ఈవిషయమున జంషెడ్జి దూరదృష్టితో చరించెనని తక్కిన మిల్లుదార్లును గ్రహించిరి; తరువాత వారిలో కొందరు సన్ననూలుతీయు మిల్లులనే ఏర్పర్చిరి. ఈ'స్వదేశిమిల్సు'లో జంషెడ్జి తాతాయు ఆయన కుమాళ్ళునే ముఖ్యభాగస్వాములై, వారే ఏజెంట్లుగ దానినడుపుచుండిరి.†[2]

  1. * తరువాత తాతా మొదలిడిన జలవిద్యుచ్ఛక్తి యుత్పత్తిచే బొంబాయికి చౌకయగు చోదకశక్తి యేర్పడి, బొగ్గుబాధ తప్పినది.
  2. †వారియనంతరము దాని నిప్పుడు నడుపుచున్న తాతాకంపెనీలో తాతాగారి బంధుమిత్రులు సభ్యులుగ నున్నారు.