పుట:2015.372412.Taataa-Charitramu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అప్పటికి మనదేశమున కొత్తపరిస్థితు లారంభించెను. సుప్రసిద్ధమగు సిపాయియుద్ధపు కల్లోల మప్పుడే యణగెను.'కంపెనీ' అధికారముపోయి బ్రిటిషు ప్రభుత్వమువారు స్వయముగా మన దేశపాలన నారంభించిరి. రాష్ట్రములందు హైకోర్టులు, 'యూనివర్సిటీ'లు కొత్తచట్టములు, ఏర్పడెను. నవనాగరికత ప్రభావము ప్రసరింపదొడగెను.



__________