పుట:2015.372412.Taataa-Charitramu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ము అభినివేశము వారి కబ్బునట్లుచేసెను. ఇట్లా మహాసంస్థలను భారతీయులే స్థాపించినడుపుటకు జంషెడ్జితాతాయొక్క ప్రతిభ, దేశభక్తి, అభినివేశము, మూలకారణములని చెప్పవచ్చును. అందువలన వానిని వానిశాఖాలను గూడ ఈపుస్తకమున వివరించితిని.

తాతా జీవితము వ్రాసినప్పటినుండి దేశపరిస్థితులు చాల మారినవి. ఆపుస్తకపుశైలి నిందు మార్చి సులభమొనర్చితిని. 'తాతాజీవితము'లోని చాలసంగతు లిప్పుడు అప్రధానములైనవి; వానినెల్ల విడిచితిని, అందలి కొన్నింటి నిందు చాల క్లుప్తముచేసితిని; ఆపుస్తకమున లెని చాలసంగతుల నిందు చేర్చితిని.

హారిసుగారు తాతానుగూర్చి రచించిన ఆంగ్లగ్రంథపు ప్రతిని సర్ దొరాబ్జితాతా ట్రస్టువారు నాకు దయతో బంపిరి. అది ఈపుస్తకమును వ్రాయుటకు నాకు చాల నుపయోగించినది. ఇందలి చిత్రపటములును అందుండి గ్రహించినవే. (ఇందుకు నేను వారికెంతయు కృతజ్ఞుడను.) ఈపటముల బ్లాకులను తిరువల్లిక్కేణిలోని విశ్వ అండ్ కంపెనీలో తయారు చేయించితిని.

దాదాపుగా, మనదేశపు పెద్దపరిశ్రమ లన్నిటిని గూర్చినప్రశంస చాలవరకు ఇందు చేరినదని పాఠకులు