పుట:2015.372412.Taataa-Charitramu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆయన స్థాపించెను. యాంత్రికతవలన లాభముతో బాటు కొంతనష్టమును కలుగునని గ్రహించి, జంషెడ్జి ఆనష్టముల తగ్గించుటకును, కార్మికుల బాగుజేయుటకును, ఉద్యోగులకు పరిశ్రమల లాభములందు సంబంధము కలిగించుటకును, చాల తోడ్పడెను; కార్మికుల విద్యారోగ్యాదుల వసతులను వృద్ధి చేయించెను. ఉన్నతవిద్యను విజ్ఞానమును వృద్ధిచేయుటకై, ఆయన లక్షలకొలది రూపాయలు నిధుల నేర్పర్చెను.

ఇప్పుడు మనదేశమంతటను వ్యాపించి భారతీయవ్యాపారమం దగ్రగణ్యమగు 'తాతా' వారి సంస్థలలో నాగపురం, బొంబాయి, అహమ్మదాబాదు మిల్లులను పట్టుపరిశ్రమను జంషెడ్జి తాతా స్వయముగ స్థాపించి, వృద్ధిచేసెను. తాజ్‌మహల్ హోటల్ మొదలగు మహాభవనముల నాయనయే నిర్మించెను; విదేశములం దున్నతవిద్యాప్రోత్సాహముకై నిధినినెలకొల్పెను. విజ్ఞానాలయపు సంస్థనుగూడ జంషెడ్జియే స్థాపించెను; లోహశాలను జలవిద్యుచ్ఛక్తిశాలను పూర్తిగా స్థాపించువరకు జీవింపలేదు; కాని ఆమహాసంస్థల సాధ్యతను కనిపెట్టి, వానిని జయప్రదముగ జరుపుటకు వలయుసాధన పరికరమును సముజాయిషీ నంతను ఆయన విశేషకృషితోను వ్యయప్రయాసలతోను సిద్ధముచేసెను; మరియు తనయనంతరము వానిని అమలుజరపుటకు తన బంధుమిత్రుల కందలి వివరములను మర్మములను బోధించి, తనతో సహచరులుగజేసి, తన ఆశయము ఉత్సాహ