పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వజ్జనబృందవందిజనతాజలజార్కుఁడు విక్రమార్కుఁ డా
యుజ్జయినీపురంబున నయోన్నతి రాజ్యము సేయుచుండఁగఁన్. 115

వ. తొల్లింటి కాలంబున. 116

క. విశ్వామిత్రుఁడు తప మతి
శాశ్వతముగఁ జేయు టెఱిఁగి శంకించి యమ
ర్త్యేశ్వరుఁడు కొలువులోఁ దన
విశ్వాసము[1] గలుగునట్టి వెలఁదుల కనియెన్. 117

క. ఓయూర్వశి యోరంభా
మీయిద్దఱలోన నొక్క మెలఁతుక నటనో
పాయంబునఁ జిక్కిడి ముని
సేయుతపంబునకుఁ గీడు సేయఁగవలయున్. 118

చ. అన విని పాత్ర నీయెదుర వాడిన నిద్దఱలోన దీనిచేఁ
బని యగు నంచు నీ వెఱిఁగి పంపుము నావుడు నట్లకాక లెం
డనవుడు నాఁడు రంభ తగ నాడినఁ జూచి ప్రహృష్టచిత్తుఁడై
యొనర ననుక్రమంబునను నూర్వశి యాడిన నట్ల మెచ్చుచున్. 119

క. వారల యెక్కువతక్కువ
లేరీతుల నెఱుఁగ లేక యింద్రుం డిఁక నె
వ్వా రెఱుఁగుదురో యని బృం
దారకమునివరుల నడుగఁ దత్సభలోనన్. 120

క. సారదయామృతమతి యగు
శారదకృప వడసి యతివిశారదుఁ డగునా[2]
నారదుఁ డుపమితశారద
నీరదుఁ డావిక్రమార్కనృపతిం జెప్పెన్. 121

  1. విశ్వసనము
  2. డయ్యున్