పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/502

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకాదశాశ్వాసము

441


జంఖారివినుతగుణసం
రంభాటోపాంధహర కరాళజ్వాలిన్.

66


మ.

తనచిత్తాబ్జములోఁ దలంచి మఱియున్ ధాత్రీశుఁ డా పాకశా
సనుసింహాసన మెక్కవచ్చిన సముత్సాహంబు వారించి కాం
చనపాంచాలిక వల్కె దానగుణవిస్తారంబున న్సాహసాం
కుని సాదృశ్యము నొందలేక యిది నీకుం జెల్లునే పార్థివా.

67


క.

అతనిదానము భువన
ఖ్యాతము సకలోపకారకారణము దయా
చాతుర్య[1]తుర్యవిధమ
త్యాతతధనకనకసముదయాకరము భువిన్.

68


క.

త్యాగంబున సత్కీర్తియు
యోగంబున ముక్తిసతియు నుచితం బగు ను
ద్యోగంబున సంపదయును
భోగంబున సుందరియునుఁ బొందినఁగూడున్.

69


క.

అనుచును ద్యాగము యోగం
బును నుద్యోగంబు నిష్టభోగంబును బెం
పొనగూడఁ దగినకాలం
బున జరపుచు నవ్విభుండు భువి యేలంగన్.

70


చ.

ఉరగము లెల్ల శేషులు పయోనిధు లెల్ల సుధాబ్ధు లేఱు లం
బరనదు లంద్రు లారజతపర్వతముల్ గ్రహము ల్సుధాకరు
ల్తరువులు కల్పవృక్షములు దైవతసంఘము లన్నియు న్మహే
శ్వరు లనఁ జెల్లె నెల్లెడల [2]సాహసభూషణుకీర్తివర్తనన్.

71
  1. చాతుర్యవిదితమదియ
  2. సాహసభూషణుఁ డుర్వి యేలఁగన్