పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/501

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

440

సింహాసన ద్వాత్రింశిక


వ.

అపుడు వడవడ వడంకుచు నేనపరాధి నైతిని బుణ్యకార్యంబు వదలి దుర్గోష్ఠి విన్నదానికి ఫలం బిపు డిట్లయ్యె దేవరయానతి తప్పునా నా కెన్నండు శాపావధి యాన తిమ్మని మ్రొక్కిన భవసఖుండు గొంత ప్రసన్నుండై నీ వాదేవతం గొలిచి తత్క్రియ నుండంగ నెప్పుడే నొకవీరుండు నరబలి మానిపింపం దాఁ జేరువయ్యెడి నప్పు డాదేవిచేత శస్త్రహతిని శాపముక్తుండవు గమ్ము పొమ్మనిన.

61


క.

ఖేచరభావం బుడిగి వ
నేచరభావమున నిట్లు నిచ్చలు జనుల
న్నీచుఁడనై వధియించుచు
నీచేతం బూర్వపదము నేఁడిదే కంటిన్.

62


మ.

అనుచుం జెప్పి కుబేరకింకరుఁడు దా నాకాశమార్గంబునం
జనియెం గ్రమ్మఱ శోణితప్రియయు నాక్ష్మాపాలు నగ్గించి
మనమార న్మును గోరినట్టి కొలఁది న్మర్త్యోపహారంబు గై
కొను టే మానితి మారి కేగు మని వీడ్కొల్పెం బ్రసన్నాత్మయై.

63


వ.

తదనంతరంబ.

64


ఉ.

దేవతఁ జూచితిన్ జనులఁ దింటయు మాన్పితి యక్షభృత్యు స
ద్భావము నొందఁజేసితి ముదం బిట చేకుఱె నంచు వీటి కు
ర్వీవరుఁ డేగుదెంచె నిఁక వింటివె వేగమ నీవు నింటికిం
బోవుట మే లనంగ విని [1]భోజనృపాలుఁడు క్రమ్మఱె న్వెసన్.

65


ఇరువదితొమ్మిదవ బొమ్మకథ

క.

అంభోధిశయను గమలా
సంభోగప్రౌఢు నబ్జసంభవగురునిన్

  1. భోజుఁడు క్రమ్మఱ నేగె లోనికిన్