పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/481

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

420

సింహాసన ద్వాత్రింశిక


క.

ఆపసిఁడిపేరు గుడిలో
దాపసుఁడై నిష్ఠ నున్న ధరణీపతికం
ఠోపాంతంబునఁ దగిలెం
బాపంగారానికర్మబంధముభంగిన్.

126


చ.

తలవరు లంతలోఁ బ్రతిపదంబును జాడలు వట్టి వచ్చుచున్
బలబలఁ దెల్లవాఱ గుడిప్రాంతము డగ్గఱి యంతలోన ని
[1]శ్చలనిజగాత్రుఁడై నియమసంస్థితుఁడౌ మతిమంతుఁ జేరి త
ద్గళమున వ్రేలుచున్న నవకాంచనమాలికఁ గాంచి యుగ్రులై.

127


ఉ.

మ్రుచ్చిలి రాచసొమ్ము లివి మున్నుగ నన్నియుఁ దెచ్చి మౌనివై
యిచ్చట నున్నఁ బోవిడుతుమె వెసఁ జెప్పుము తోడిదొంగ లిం
కెచ్చట నున్నవార లని యీడిచి చేతులు గట్టి మోఁదుచుం
దెచ్చి కళంకతో వసుమతీపతిముందఱఁ బెట్టి రాతనిన్.

128


సీ.

జీవరక్షకుఁ డను నీవు జీవంబు వో
        నాడక చెప్పరా తోడివారి
నెక్కడ నుంచితి తక్కినసొమ్ములు
        తెమ్మని కొట్టించి ధృతి యడంచి
యొకయుత్తరంబు నీయక యున్నఁ జంపింపఁ
        గడఁగియుఁ దనపేరికడిమి దలఁచి
[2]కోపించి కాల్సేయి గోయించి వెడలించె
        నాలోన నొకవైశ్యుఁ డతని బ్రోవఁ


ఆ.

గరుణ నుడుకునూనె గాపించి వగయార్చి
కూడునీళ్ళు నొసఁగి వాడుఁ దేర్చి

  1. శ్చలమునవేషయోగమున సంస్థితు
  2. గొంచుచు నతనికాలుంజేయు గోయించ - రోజుచు నతనికాలుంజేయి