పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/480

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దశమాశ్వాసము

419


బడకుండ [1]జెలులు మాటఁగ
నొరయనిక్రియ నులుకులేక యొకరుఁడు సొచ్చెన్.

122


ఆ.

అచట నూర్పు లరసి యాబాల నిద్రించు
టెఱిఁగి యొయ్య డాయనేగి వాఁగు
మీలఁ బుడికిపట్టు జాలరికైవడిఁ
బుడికి పుచ్చుకొనియెఁ దొడవులెల్ల.

123


సీ.

అన్నియు నౌలకు నందిచ్చునప్పుడు
        మును స్వయంవరమున కనుచు డాఁచి
దండియపై నిడ్డ తపనీయమాలిక
        భుజము సోఁకిన దానిఁ బుచ్చుకొనుచుఁ
గన్నంబు వెడలి సంగడికాండ్రఁ గూడిన
        నందఱు నుల్లాస మతిశయిల్ల
దుర్గంబు వెలువడి దూరస్థలంబున
        సొమ్ముల తరబడి చూచునపుడు


ఆ.

వెనుకఁ బురములోన ఘనముగా ఱంతయ్యె
నారెకులును దివియ లందికొనుచుఁ
గల్లపుట్టె ననుచు నెల్లదిక్కుల జాడ
లరయఁ జొచ్చి [2]రప్రమత్తు లగుచు.

124


క.

ఆకలకలమున నిలువక
యాకులులై పసిఁడిపేరె యధికం బనుచున్
లోకేశ్వరికై గుడియా
వాకిటఁ బాఱుచును లోన వైచిరి మ్రుచ్చుల్.

125
  1. శాలమాటుగ-చెయ్యిమాటిడి
  2. రతిభయార్తు లగుచు-రతివిహస్తు లగుచు