పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/475

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

414

సింహాసన ద్వాత్రింశిక


[1]జూదమున ధాతువాదము
వాదంబునఁ దొడరఁ జే టవశ్యము గలుగున్.

95


ఉ.

హితుని తెఱంగునన్ హితము నిష్టముఁ జేకుఱ బుద్ధి చెప్పితి
న్మతిఁ బరికించి దుర్వ్యసనమగ్నుఁడవై చెడకుంటివేని సు
స్థితి యొనగూడు లోకమునఁ దేఁకువయుం జెడకుండు నన్న నా
[2]కితవవరుండు నవ్వి యదిగేలిగఁ జేయుచు బల్కెఁ బ్రౌఢుఁడై.

96


ఆ.

ద్యూతకేళిరసము త్రోవ యెఱుంగక
పలికె దీవు వెడఁగుభావమునను
[3]వలనుగల్గి వాడఁ జెలమనీరము మాడ్కి
దీన నర్థ మొదవు తెరువు పుట్టు.

97


క.

ధనలాభంబు బురాణము
వినికియు వాద్యంబు యోగవిద్యయు శాస్త్రం
బును సంగీతముఁ గావ్యం
బును నాటకములును జూదమున కెనయగునే.

98


క.

గెలుపుతమకమునఁ జిత్తం
బలరంగాఁ గపటజూద మాడక యెవ్వం
డలసుఁ డయి చనియె భువి ని
ష్ఫలజన్ముఁడు వాఁడె కాఁడె పసరముభంగిన్.

99


క.

[4]ఒక రూక వట్టి పది వే
లకు నొడ్డుచు నాడినట్టిలాభము గరద

  1. జూదమునం జాంబూనదవాదంబున
  2. కితవరుఁ డల్లనవ్వి
  3. వలను గల్గియాడ
  4. ఒకమాడపట్టి .. . నెర రప్పక-గొండ్రందఱు, గాండ్రనుడుకు