పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/474

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దశమాశ్వాసము

413


క.

ఎక్కడఁ గోరిన దాయము
లెక్కువతక్కువలు గాక యేతేరంగా
నెక్కటి నెత్తమ్మున గొ
మ్మెక్కటియును నాడ నేన యెక్కటిఁ జుమ్మా.

90


క.

తగులు విరియైనఁ గడు మె
చ్చుగ నాడుదుఁ బులుల మూఁటజూదంబులలో
మిగులఁగ నేర్పరిబాగిడి
తిగుటన్ సొగటాల నే నతిప్రౌఢుండన్.

91


ఉ.

మేదిని నిట్లు జాణలకు మెచ్చగు నాటలు నేర్చువారికే
నాది యనంగ నొప్పుచు నహంకృతి నిప్పుడు దప్పనాడి యా
జూదమునందుఁ జిక్కి విరసు ల్నను నవ్వఁగ మేనివజ్రభూ
షాదిసువస్తువు ల్గెలిచినాతని కిచ్చి వివర్ణ మొందితిన్.

92


ఉ.

దైవబలంబు లేమి గతి దప్పిన నర్థము గోలుపోయితి
న్నావుడు బుద్ధిగా దని మనంబున కింపు జనింపఁజేయ ను
ర్వీవరుఁ డిట్లను న్వినుము వీఱిఁడిచేఁతలు మాను మేదినిన్
దేవతల న్భజింపు సుగతిస్థితులొక్కట నీకుఁ జేకుఱున్.

93


క.

[1]ధనమును సత్యము శౌచం
బును నాదిగఁ గోలుపోవు భువి దుర్వ్యసనం
బని యెన్నఁబడ్డ జూద
మ్మున బ్రుంగుడు వంగుడౌటఁ బొందిది యగునే.

94


క.

జూదమున నలుఁడు చెడియెను
జూదంబున నట్టిధర్మజుండును జెడియెన్

  1. ధనము యశమును సత్యంబును ... బ్రుంగుడు బ్రుంగుడౌట-బ్రుంగుడు మగ్గు డౌట