పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/467

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

406

సింహాసన ద్వాత్రింశిక


మును దిలీపుఁ డిష్టముగఁ గాచునందిని
నెగసిపట్టు నామృగేంద్రుకరణి.

56


క.

ఉఱికిన నాపులితల దెగ
నఱికినఁ బులి మాయమైన నభమున సుర ల
త్తరి మెచ్చి పుష్పవర్షము
తఱచుగఁ [1]గురియించి రభయదాయకుమీఁదన్.

57


చ.

అవనివరుండు నెమ్మనమునం దతివిస్మయ మంద నొక్క లా
ఘవమున లేచి పల్వలము గ్రక్కున వెల్వడి కుఱ్ఱి లోచనో
త్సవమగు దివ్యభావమున సన్నిధి గైకొని యేను గామధే
నువ నిను మెచ్చితి న్మదికి నూల్కొనునిష్టము వేఁడు నావుడున్.

58


క.

తద్భాషణమున మదిఁ గడు
నద్భుతముఁ బ్రియంబు నిగుడ నాతఁడు సురసం
పద్భోగభాగ్యనిధి యని
సద్భావముతోడ మిగుల సన్నుతుఁ డగుచున్.

59


క.

అమృతాహారులు నసురులు
నమృతంబునకై మహాప్రయాసముతో న
య్యమృతాంభోనిధి దరువఁగ
నమృతము నీయంద కలుగ నటఁ బుట్టితివే.

60


క.

పుట్టినయి ల్లంబుధి తోఁ
బుట్టువు లమృతేందు[2]కల్పభూజము లవి య
ప్పట్టున నూరక మనఁగా
నిట్టి విరోధంబు నీకు నేలా కలిగెన్.

61
  1. గురియంజేసి రభయదాయకునిపై వేడ్కన్
  2. కల్పభూజాదులచే, పట్టుసురలోకమనఁగా