పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128 సింహాసన ద్వాత్రింశిక

రాచిల్కగములకు వాచవిఁ జుబ్బన
చూఱగా[1] నొనరించు సొంపుకాఁడు
కోకిలంబుల కెల్ల మూకభావంబులు
విడిపింప నడరెడు వెజ్జుఱేఁడు
ఆ. తేఁటికదుపులకును దేనెతోఁ బుప్పొడి
మేపిమరపనేర్చు తీపులాఁడు
మ్రాఁకులకు ముదంబుఁ బ్రాయంబు వాటిల్ల
వింతఁ దోఁచె భువి వసంతుఁ డంత. 126

వ. అప్పు డామలయాచలంబు నుండి. 127

క. వే చని చని ఫణిసతులకు
వాచవి పుట్టించి[2] రత్నవతి యనునదిలో
వీచికలఁ దోఁగి[3] మెల్లన
వీచెం దెమ్మెరలు మరునివీచోపులనన్. 128

క. మరుఁ డరుదేరఁగ ముందఱఁ
దిరువీథులు దుడుచుకరణిఁ దిరుగుచుఁ బవనుం
డిరవుచెడ వీవ జడియఁగఁ
దరువులఁ గారాకు ధరణిఁ దఱచై రాలన్. 129

క. బలిమియుఁ గలిమియుఁ జెలిమియు
నలవడ వచ్చిన వసంతుఁ డనుచుట్టముతోఁ
గలసిన నెలకొను పులకల
మొలకల క్రియఁ దరుల మొత్తముగఁ జిగురొత్తెన్. 130

క. చెలరేఁగి మరుఁడు విరహులు
దలఁకంగా దండుగదలు తఱి నతనికి మా

  1. గుబ్బునచూర-చిన్నయసూరి
  2. రత్నవతి యగునదిలో
  3. దూఁగి