పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

113 తృతీయాశ్వాసము

నూకరలిచ్చు[1] నయ్యుయ్యాలఁ జేరిన
నడు మెత్తివైచు ముందలయు నెత్తు
జోవలు వాడిన[2] భావించు నాలించు
చుండు నేడుపు మాను నుగ్గు లడుగుఁ
గోరి డగ్గఱఁగ నంగుష్ఠంబు[3] నోరిలో
నిడుకొనుదాఁ జన్ను గుడుచుభంగిఁ
ఆ. జిన్నిపాదములును జేతులు జాడించు
జవనగతిని మొరయ రవళి దన్ను[4]
బోరగలి ఫణీంద్రు పోలికఁ దలయెత్తి
యాడు బలుక నందునందుఁ జూచు. 48

క. కూర్చుండు నురమునం జన
నేర్చును విద్ధాంబు సేయనేర్చును భీతిం
దార్చుచుఁ దప్పుటడుగు లొడఁ
గూర్చు జనని చెట్టపట్టుకొని నడపాడున్. 49

క. విందులు విందు లనుచు వే
డ్కందనుఁ బిల్వంగ నగుమొగం బలరంగా
నందియలు మొరయఁగా గురు
లుం దూలఁగ[5] వచ్ఛి యంతలోఁ గప్పుకొనున్. 50

క. నిలువెల్లను గనకం బై
పలు కంతయు నమృత మగుచుఁ బార్థివునకు ము

  1. నూదరలిచ్చు
  2. జోలలు వాడిన నాలించు
  3. కాలియంగుళము డగ్గఱబట్టి నోటిలో
  4. జన్నుగడియ మొరయ దన్ను చూచు
  5. మొరయ గున్నాలుం దూలగ—వచ్చునింతలో నెత్తుకొనన్