పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112 సింహాసనద్వాత్రింశిక

కొనరఁగాఁ గాటుకయును జుక్కబొట్టును
బాటించి యాగడపకు వెలుపటఁ[1]
బొదికిళ్ళఁ దవుడు నిప్పులుఁ బ్రత్తిగింజలు
నిడి యడ్డముగఁ జిట్టు బడిసివైచి[2]
వేఁపరెమ్మలు నీళ్ళ వెసలలోపల సించి
కాపులు పురిటింట గట్టి చేసి
ఆ. వాయనములకెల్ల వనితల రప్పించి
వారు దెచ్చినయవి వరుస నంది
పచ్చకప్పురంపుఁ బలుకులు పట్టి వి
డియము లిచ్చి రింపు నయము గలుగ. 45

క. వెడలం బడితివి చక్కని
కొడుకు బడసితివి రాజుకూరిమి బలిసెం
బడఁతీ నీ భాగ్యమునకు
గడలే దని పొగడి రెల్ల కాంతలు నింతిన్. 46

ఉ. మండలనాయకుండును గ్రమంబున నాపురుడైన యంతఁ బం
డ్రెండవనాఁడు పాపనికి రేవతి గావున మీనరాశి చం
ద్రుం డని పేరు పెట్టి యతిరూఢిగఁ బెంపఁగ వాఁడు బాలచం
ద్రుండును బోలె నిచ్చలును దుష్టియుఁ బుష్టియుఁ గాంచుఁ గాంతితోన్. 47

సీ. వెలఁదులు వీని నవ్వింప నోయని నవ్వు
వేడుక మూతియు విఱుచుచుండు[3]

  1. పచ్చనికూటఁబడిసి
  2. నిడియందముగ జుట్టువడసి వేసి-చిన్నయసూరి
  3. వెలదుకుల్ వినఁగ నవ్వించ ననంగ
    నొయ్యనవ్వుచు మూతులల్ల విరుచు