పుట:సత్యశోధన.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

196

బోయరు యుద్ధం

ఆంగ్ల మిత్రులు నా యీ ప్రయత్నాన్ని చూచి చప్పరించారు. డాక్టర్ బూత్‌గారొక్కరు మాత్రం ఏ ఏ విధంగా చేయాలో నేర్పారు. మేము యీ పనికి తగిన వారమని డాక్టర్ సర్టిఫికెట్లు సంపాదించాము. లాటనుగారు, ఎస్కాంబిగారు మా ఉద్దేశ్యాన్ని మెచ్చుకొన్నారు. యుద్ధంలో మా సేవల్ని అంగీకరించమని ప్రభుత్వానికి దరఖాస్తు పంపాము. ప్రభుత్వం వారు మమ్ము అభినందించారు. ఆయితే యిప్పుడు అవసరం లేదని మాకు తెలియజేశారు.

నేను “అవసరంలేదు” అని వచ్చిన సమాధానంతో వూరుకోలేదు. డాక్టర్ బూత్ గారి సహాయంతో నేటాలు బిషప్పుగారిని దర్శించాను. బిషప్ గారికి మా ఉద్యమం ఆనందం కలిగించింది. ఆయన తప్పక సాయం చేస్తానని మాట యిచ్చాడు.

ఇంతలో ఘటనా చక్రంలో కొంత మార్పు వచ్చింది. తెల్లవాళ్ళు బోయర్ల సన్నాహాన్ని, దార్డ్యతను, పరాక్రమాన్ని గుర్తించసాగారు. దానితో తెల్ల ప్రభుత్వం కదిలింది. క్రొత్తవారిని ప్రోగు చేసుకోవలసిన అవసరం కలిగింది. చివరికి నా ప్రార్ధన అంగీకరించబడినది.

మా దళంలో సుమారు 1100 మందిమి వున్నాం. యిందు నాయకులు నాలుగు వందల మంది. సుమారు మూడు వందల మంది స్వతంత్రులగు భారతీయులు, మిగిలిన వారంతా గిరిమిటియాలు. డాక్టర్ బూత్ గారు కూడా మాతో వున్నారు. దళం చక్కగా పని చేసింది. మా దళం పని సైన్యానికి బయటనే. దీనికి రెడ్ క్రాస్ అనగా లోహిత స్వస్తికం యిచ్చారు. అది యుద్ధంలో పడిపోయిన వారికి ఉపచారం చేసేవారు ఎడమచేతి మీద పెట్టుకునే ఎరగ్రుర్తు. ఈ గుర్తు కలవారిని శత్రువులు కాల్చరు. ఇంకా ఎక్కువ వివరం తెలుసుకోదలచిన వారు దక్షిణ ఆఫ్రికా సత్యాగ్రహచరిత్ర చదువవచ్చును. ఆ గుర్తు మా రక్షణ కోసం మంజూరు చేశారు.

ఒకానొక సమయంలో మా దళం యుద్ధరంగంలోకి కూడా పోవలసి వచ్చింది. లోగడ ప్రభుత్వం వారు వారి యిష్ట ప్రకారమే అపాయస్థలంలోకి వెళ్ళుటకు మాకు అనుమతి యివ్వలేదు. కాని స్కియాంకోపు చెయ్యి జారి పోయేసరికి పరిస్థితులు మారిపోయాయి. అప్పుడు జనరల్ బులర్‌గారు యుద్ధరంగంలో పనిచేయాలనే నిర్బంధం మీకు లేదు, అయినా అపాయానికి సిద్ధపడి పడిపోయిన సైనికుల్ని, ఆఫీసర్లను యుద్ధరంగంలోకి వెళ్ళి ఎత్తుకుని డోలీలలో తీసుకొనివచ్చేందుకు సిద్ధపడితే ప్రభుత్వం వారు మీ ఉపకారాన్ని మరచిపోరని వార్త పంపాడు. మేమందుకు సంసిద్ధంగా వున్నామని సమాధానం పంపాము, తత్ఫలితంగా స్పెయాంకోప్ యుద్ధం