పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

కవులే అన్నాడు (విక్రమాంకచరిత్ర చూ). దాదాపు రెండువేల పద్యాలు యీ కవి యీచరిత్రలో లిఖించాడు. చేదస్తంగా పెంచిన ఘట్టం వకటి లేదు. ఋతువర్ణణకు గాని సూర్యోదయ—సూర్యాస్తమయాలకు వొక్కోక్క పద్యంకంటె ఖర్చు పెట్టినట్లు లేదు.

★★★ ★★★ ★★★ ★★★ ★★★ ★★★

ఈమాదిరి పద్యాలు సర్వత్రా వున్నాయి. చదువరులు చూచు కోవలసిందేగాని వుదాహరించవలసివస్తే వ్యాసం తేమలదు. సూత్ర ప్రాయంగా సుమారు పదేళ్ళకు పూర్వం పుస్తకాన్ని నేను చదివి యిచ్చిన అభిప్రాయం మూడు నాల్గు పంక్తులు మాత్రమే దానికి యీ విమర్శనం భాష్యం వంటిదేకాని అన్యం కాదు.......

ప్రస్తుత గ్రంధకర్త తురుష్క భాషాపదాలు చాలా వాడవలసివచ్చింది. ఆయా రాజుల నామధేయాలు దేశాల పేళ్లు పట్టణాల పేళ్ళు స్త్రీల పేళ్ళు సమస్తమూ ఆభాషలోనే వున్నాయి. వాట్లని మార్చడం యెట్లా? కొన్ని సంస్కృతభాషా సంపర్కం కలిగివున్నా తేజసింగు వగైరా అవిన్నీ అపభ్రంశంగానే వున్నాయి. అట్టి శబ్దాల విషయంలో గ్రంధకర్త బాధ్యుడు కాడని విజ్ఞు లెరిగినదే. యెన్నో లోకోక్తులు సమయోచితంగా రసోచితంగా యీయన వాడివున్నాడు. అందులో కొన్ని గోదావరీ మండలం వారికి అపరిచితాలు. అట్టిది ఒకటి చూపుతాను. యీలోకోక్తి "పాండవబీడు” ఈ ప్రాంతంలో "అయ్యవార్లంగారి నట్టిల్లు” పర్యాయంగా వుంటుందేమో అను కుంటాను. ఇది వాడినచోటు

గీ॥ వట్టి పాండవ బీడు మేవాడ సీమః

సందర్భాన్నిబట్టి చూస్తే శుద్దదరిద్ర ప్రదేశమనియ్యేవే తేల్తూవుంది. యింకా కొన్ని యిలాటివే వున్నాయి.

స్థాలీపులాకంగా ఈ రాజశేఖర కవి కవిత్వాన్ని గూర్చి కొన్ని మాటలు వ్రాశాను. ఈయన దే శ భ క్తి పరవశుడే కాని కులాచారాలయందు పట్టుదల కలవాడు. ఈ విషయం కవిత్వంలో సర్వత్రా గోచరిస్తుంది. సంస్కృత భాష లో కూడా మంచిప్రవేశం కనబడుతుంది. తెలుగు