పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5

తే॥ మనుజపతిమౌళిమన్మధ మన్మధుండు
    చైతకాశ్వముపైన సాక్షాత్కరించి
    దివ్యదర్శన మిచ్చె నా తేజమునకు
    నంజలి ఘటించి యాత్మోపహార మిడుదు.

అబ్దూరహిమాను అనే పెద్దమంత్రి అగ్బరు చక్రవర్తితో మహా సభలో మాట్లాడే మాటలను వివరించే పద్యాలు సుమారు 25టి దాకా వున్నాయి. ఆపద్యాలలో యిది వొకటి పద్యంలోవున్న చైతకం రాణాప్రతాప సింహునికి ప్రాణతుల్యమైన వాహనం అబ్దూరహిమాను యెంతటి సహృదయుడూ కాక పోతే తన్ను యుద్ధంలో యెదుర్కోవడానికై సర్వ సన్నాహంతో వచ్చిన (శత్రువు) ప్రతాపుణ్ణి అంత పేర్మితో తనప్రభువు సమక్షంలో నిర్దేశించ గలడా? యింకో పద్యంకూడా వుదాహరిస్తాను.

మ॥ అకటా! నీవలేె ధర్మముల్ దెలిసి రాజ్యంబేలఁగా లేఁడొ, మ
    చ్చికమై భూప్రజఁ బుత్రులంబలెఁ గృపా శ్రీఁ జూడఁగా లేఁడొ, పా
    యక వర్ణాశ్రమ ధర్మ పద్ధతి తిరంబై నిల్పఁగా లేఁడోొ, యెం
    దుకు నాతండు స్వతంత్రుఁ డై నిలువఁగాదో? యానతిఁ గోరెదన్.

ఇంత నిర్భయంగా నిష్పక్షపాతంగా చక్రవర్తితో - (చాటునా మాటునా కాదు) మహాసభలో - శత్రుగుణాలను వ్యాఖ్యానించే రాజకీయోద్యోగులు వుంటే వుంటారేమో కాని విని సహించడమే కాకుండా అభినందించడం కూడా వున్న సార్వభౌముడు ఒక్క అగ్బరేకాని యిం కొకడు లేడనే చెప్పొచ్చు. రాణాప్రతాపసింహచరిత్ర అనే పేరుతో కవి దీన్ని రచించినా 'అగ్బరు చరిత్ర' అనే నామాంతరంతో దీన్ని పిలిస్తే పిలవవచ్చుననే నే నసుకొంటాను. నిజానికి అగ్బరు అట్టి మహానుభావుడో? కాదో? కాని గ్రంథకర్త రచన అతణ్ణినిషధయోగ్య - చక్రవర్తి శిరోభూషణంగా చిత్రించింది. బిల్హణుడేమన్నాడు ? రావణాసురుణ్ణి దుర్మార్గుణ్ణి చేసినవాళ్లూ కవులే, రాముణ్ణి, మహామహుణ్ణి చేసినవాళ్లూ