పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

52

శ్రీనివాసవిలాససేవధి


ఇమ్ము దప్పిన వేళ నెమ్మి యేమిటికి
ననుచు యోజనఁ దెల్పు నా వన్నెలాడిఁ
గనుఁగొని దైన్యంబు గదురంగ జనువు
ముమ్మరించగ నతిముగ్ధభావమున
కొమ్మను వెంటఁ దోడ్కొని నడురేయి1240

పురము రాజ్యము ధనంబులను బో విడిచి
నరపతి ఘోరకాననముల కరిగె
అరుగుచో నామాళవాధిపుకన్య
ధరణి మోపినఁ గందు తన పాదములను
పలుగురాళ్లును [1]ముండ్లు బలుకంప లడరు
బలుకానఁ బ్రియునివెంబడి నంట నడవ
చిగురులకన్నను జిగికోమలికము
తగునట్టి యడుగుల తగిలి కంటకము
లెడలేక నాట నయ్యెలనాఁగ నొప్పె
దడయుచుఁ జీకటిఁ దడవాడికొనుచు1250

తోవఁ గానక పొదల్ దూరి మేనెల్ల
దీవెలుకంప లెంతేఁ గొట్టి జీరు
కొనునట్టి బల్ చురుకును నెరుంగకయె
గునుకగంటికి రూఢీ కోరెందగుములు
కుంతళంబులఁ బట్టి గుంజి యీడువగ
నంతయుఁ దప్పించి యరుగుచో నెదుట
గుటగుట రొప్పుచు కోల్పులుల్వెలుగు
లటవీభములు వరాహములు గార్పోతు

  1. వ్రా.ప్ర. ముండ్లు బరికింప లడరు