పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/384

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షష్ఠాశ్వాసము

353


యలదేవతలును దేశాంతరజనులు
కలిసి యందరు వచ్చి కడువడి నడరఁ 1100

జెలువొప్ప నర్చించి శ్రీనివాసులను
శేషాధిరూఢుగాఁ జేసి తిర్వీధి
భూషణద్యుతుల నుప్పొంగ నేగింప
హరి యప్పుడు తన శేషాసనత్వమును
[1]వరభక్తులకు దెల్పు వైఖరి మెరసి
యా మరుసటినాడు హంసనిష్ఠుడయి
తామరచూలికిఁ దత్వబోధనము
సలుపుట రూపించి సారె మర్నాడు
కలితసింహస్థితి గనుపట్టి మున్ను
బలువిడి యుక్కు కంబంబున వెడలి 1110

ఖలు హిరణ్యునిఁద్రుంచు కక్కసితనము
రహి గనుపించి మర్నాడు లోకింప
మహిసుతయును దాను మహితపుష్పకము
పయినెక్కివచ్చు టిబ్భంగి యన్ పగిది
రయమునవిరిచప్పరముమీఁద నలరి
గరుడునిపై నెక్కి గజరాజుఁ బోరు
ఖరనక్రముం ద్రుంచు గతి నిరూపించి
మరునాడు నా హనుమంతుపై నెక్కి
కరకురావణుఁ గూల్చు కడక న్నటించి 1120

యంత శత్రుంజయ మను నేన్గు నెక్కి
యెంతయు శ్రీరాముఁ డే నై యయోధ్య

  1. "వరదభక్తులకు " వ్రా. ప్ర. పాఠము.