పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/372

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షష్ఠాశ్వాసము

341


నివ్వగ సేయునో యెరుఁగరాదయ్యె
నిది తెలివిడి గాఁగ నిపుడె దేవరవు
కదలి విచారించఁగావలె నొండె
తగు నాప్తులైన పెద్దలఁ బంపి తెలియ
నగునొండె యిదియెంత యని యుండరాదు 820
దినదినం బీ గతి తెఱువున పాలు
కనుకట్టువలె పోవఁగా నగరికిని
పాలురాలేదని ప్రభువులు మమ్ము
చాల దండింపఁగా జనులెల్ల తారు
మదిని శంకింప రే మము దొంగ లనుచు
అదిగానఁ దెల్పితి మంతయు ననిన
విని నరపాలుఁడు విస్మయంబునను
మనమునం జింతించి మంచిదేఁ వెనుక
నన్నియుఁ [1]దెలిసెడునని వారిఁ బంచి
తిన్నఁగా నరిగి యంతిపురంబునందు 830
వసుధేశుఁ డా గొల్లవారి వాక్యములు
వెసవస తలపోసి వెంకటగిరిని
వెన్నుఁ డున్నాడండ్రు విబుధు లాపల్కు
లన్నియు నిక్కమే యాపుట్టయందు
హరి యుండకుండిన నట్టి పాలెల్ల
నిరతంబు నచ్చోటనే చిందనేల
యని యూహసేయుచు నాహ్నికక్రియలు
దనరంగఁ దీర్చి యెంతయు శుద్ధుఁడగుచు
పరమాత్ము మదిలోన ధ్యానించుకొనుచు

  1. "దెలియుదానుని" వ్రా. ప్ర. పాఠము.