పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

272

శ్రీనివాసవిలాససేవధి



నీవు మేలొందుట నేను నమ్ముదునె 520
యీ వంచనకు నేమి యెల్లవారలను
నీవె మోహింపించు నెఱ మాయదారి
వెదను నిస్సంగత నెసఁగి బల్మాయ
వదలక లోకభావనఁ జేసె దిచట
అదిగాక సరిలేని యందచందముల
మదిరాక్షి యలమేలుమంగ యుండంగ
మరియు నొక్క మిటారి మహి నీదు దృష్టి
కరయ తాళినయట్టి యంగన గలదె
నే నెఱుంగుదు సామి నిక్కంబు దెల్పు
మా నాతి కెందుకై యాశించి [1]తనఁగ 530

పద్మావతియం దాతని యనురాగమునకుఁ గల కారణము

చిఱునగ విగురొత్త శ్రీనివాసుండు
మఱియు నత్తరుణి ప్రేమను జూచి మొదట
నా వరవర్ణిని యర్ధించి తన్ను
భావించు తెరగు తెల్పగ నిట్టు లనియె
కను మట్టి కథ నీకు వివరింతు నింతి
మునుపల్ల కృతయుగంబున బృహస్పతికి
సుతుఁ డొక్కఁడు కుశధ్వజుం డనువాఁడు
సతతంబు స్వాధ్యాయశాలియై తపము
నెఱుపుచు మద్భక్తినిష్ఠుఁడై యుండు
పఱగ నాతఁడు వేదపఠనంబు సల్పు 540
వేళ నాతని ముఖవివరంబునందు
బాలికె జనియించె భవ్యరూపమున

  1. వ్రా. ప్ర. పాఠము. " యాశించితే నుండు"