పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్థాశ్వాసము.

209


కని యొచ్చె మింతయు [1]గనమిదహల్య
యని సంజ్ఞ గావించె న య్యించుబోణి
చెలువు నుతింప వేజిహ్వలకైన
నలవియే యా మోహనాంగి మైరంగు
ననుపమశృంగారహావభావములు
కనుఁగొన పదివేలు కండ్లు గావలయు
అంతట నాధాత యాస్థానమునను800.
శాంతు లౌ సనకాదిసకలయోగులును
గౌతమ కణ్వాత్రి కశ్యప కుత్స
శాతాతప వసిష్ఠ శరభంగ పులహ
ఘటజ భరద్వాజ గర్గ భృగ్వాది
జటిసంఘములు నింద్ర చంద్ర యజేంద్ర
వరుణ యమాది గీర్వాణముఖ్యులును
గరుడకిన్నరపన్నగప్రవరులును
మనువులు రాజర్షి మండల మేను
మునుగాఁగ నందఱుఁ న్ముచ్చటాడుచును
పరతత్వవిభవ తత్ప్రాప్త్యుపాయములు810.
పరమధర్మస్థితుల్ పరికించు తఱిని
నలినసంభవుని యన్తఃపురసీమ
వెలువడి మోహనవిద్యయో యనఁగ
వనజాస్త్రు నిష్టదేవత యిది యనఁగ
జనలోచనోత్సలశశిరేఖ యనఁగ
మౌనేంద్రధ్రుతివంశమంజరియనఁగ
జ్ఞానకాసారవంశావళియనఁగ

  1. "గనమీనహాస్య" వ్రా. ప్ర. పాఠము.