పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

202

శ్రీనివాసవిలాససేవధి


యమరిక కటిఁ గట్టినట్టి లేమావి
చివురులజొంపంబు చెంగావి విడిచి
సవరణ లవలి కిసలపాళి యనెడు
తెలిదువ్వటం బూరుదీప్తితో మలయ
చెలువుగా [1]వెందీగె చేల్గట్టికురులు630.
తుదలం బొదలి నిల్చు తోయబిందువులఁ
గదిసిన మల్లెమొగ్గలతో విదిర్చి
కీలుగం టొనరించి కినిసి చీఁకటులు
చాల నిందుని కల్గి శశిఁ గెల్చు మోము
వెనుకఁ జేరిన వాటి వెస నాదరించు
ననువున కొనగోర నమర దువ్వుచును
రవికర మటు చేరరాక యుండంగ
నవపల్లవము మౌళి నయముగాఁ బూన్చి
నెలరాల నపు డొత్త నెరయు జవ్వాది
మెలకువఁ గని తీసి మేటి జక్కవలు640.
సరిపోర రానీక చన్గవ నలఁది
హరిణముల్ కన్నుల యందంబు గొనుటఁ
బొగిలి తద్రక్తంబు బొట్టిడు పగిది
మృగనాభితిలకంబు మెప్పుగా దిద్ది
పిరుదుకు సాటిగాఁ బెనఁగుట నల్క
కరికుంభముల నేయగా నందుఁ జిందు
నల ముత్తియంబుల హారముల్ దాల్చి
మొలకచన్గవమీఁద ముద్దు గుల్కంగఁ

  1. వ్రా.ప్ర. "వెఁదీలగెచేగట్టె"