పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము.

169


ప్రతిదినము వాహనారోహణము - వీధి విహారము


పవనజమృగరాజపక్షీంద్రహంన
జవనాశ్వగజవరస్యందనప్రముఖ
వాహనారోహణవైఖరిమెఱయ
నాహరబ్రహ్మాదు లై నదేవతలు
నారదాదిమునిగణంబు గంధర్వ
చారణకింపురుష పతగపన్న
గాదులు మేన కాద్యస్సరోజనులు
వైదేశిక ప్రజల్ వరుసఁ గొల్వఁగను
వీధివిహారముల్ వెలయంగ సవము
సాధించి యవబృథస్నానంబు సలిపె870.
అమరులు మునులు ముం దవనిజనములు
క్రమమున స్వామి పుష్కరిణితీర్థమున
నపుడు గ్రుంకిడి వార లందరు దురిత
కపటకర్దమములు గడిగి సౌభాగ్య
రమణీయరమఁ గాంచి రంజిల్లి రంత
కమలసంభవుఁడు శ్రీకమితకుఁ బుష్ప
యాగంబు సవరించి యాగమవిధుల
బాగుగా హవనముల్ పరిపూర్తిచేసి
అమరధ్వజావరోహణము గావించి
అమరులు పొగడఁ గృతార్థుఁడై తనరె880.

శ్రీనివాసులు బ్రహ్మాదులను బహూకరించుట.



శ్రీనివాసులు బ్రహ్మ చేయించినట్టి
మానితోత్సవమున మది సంతసించి