పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము.

167


భవుఁడు నబ్జభవుండు పసిడిబెత్తముల
రవళిఁ జేబట్టి బరాబరీ సల్ప
ఘనములు భేరికాకారంబులగుచుఁ
గడునినాదంబులం గడుభోరు కలగ
నొరపుసింగారంబు నొక్కరూపైన
తెరగునఁ దసరుచుఁ దిరువీధు లేగి
యావేళఁ దనుఁగొల్చు నఖిలలోకులకు
వేవేగ నిష్టముల్ వేస నొసంగుచును820.
నిజదివ్యరత్నమందిరభద్రపీఠి
విజయంబుసేసి యా వెలఁదుల్ నివాళు
లారతు లెత్తంగ నమృతోపమాన
సారాన్నభోజ్యచోష్యము లారగించి
తదవశేషంబు లందఱకు నొసంగి
మృదుశయ్యం బవళించె మెలతలు గొలువ
నారేయి క్షణదయంచాఖ్య నిక్కముగ
మీరి మహోత్సవోన్మేషం బొనర్చె
హరిదిగ్రమణి నాసికాభరణముగ
ధరియించుముత్యమై తగు వేగుచుక్క830.
మయి నలందిన కుంకుమద్రవసార
మయి విలసిల్లె నయ్యరుణ రాగంబు

సూర్యోదయ వర్ణనము.


తిరునాళ్లఁ గనుటఁ జెందిన ప్రసన్నతను
మురియుచు దిగ్వధూముఖపాళి దనరె
పొడుపుగట్టను సౌధమును కయిసేయ
నిడిన దీపంబన నినుఁ డుదయించె