పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

90

శ్రీనివాసవిలాససేవధి


గృప వెల్లివిరియ వీక్షించి యవ్విప్రు
జడియ కోడకు మని చల్లనిదృష్టి
కడునాదరింపుచు కమలేక్షణుండు
వినుతభూసుర నీకు వెత లేల యింక
కనికరంబునలక్ష్మి కరుణించె నిన్ను 320
చిరతరైశ్వర్యంబు చిత్తసమ్మదము
వరపుత్రసంపద వై భవంబులును
జనపూజ్యతయు నీ కొసంగుదు నెపుడు
జననిగర్భమునందు జనియించుక్లేశ
మొందవు [1] మోక్షంబు నొసఁగుదు తుదను
ముందుగా విజ్ఞానమును నీకుఁ గల్గు
నని యానతిచ్చి మాయలు గప్పి యపుడె
ఘనమందిరము దాను గనుపించఁడయ్యె
అంతట నావిప్రు డం దేమి గాన
కెంతయు వెఱఁగంది యెద శ్రీనివాసు 330
చెలువు నమ్మందిర శ్రీకరాకృతియుఁ
దలఁచి దలంచి సంతతచింతతోడ
నానందభాష్పంబు లడర కన్గవను
మేను వడంకఁగా మెల్ల నేమరలి
స్వామిపుష్కరిణిప్రవాహంబునందు
నేమంబులను దీర్చి నెలకొన్నభక్తి
శ్రీ వేంకటేశ్వరుఁ జింతించుకొనుచు
భావంబలర నాత్మభవనంబుఁ జేరు

  1. వ్రా. ప్ర. మొందదు.