పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


విడుఁడు శివుని [1]యాన మృడునాజ్ఞ [2]దాఁటి మీ
రాజు (చెడుట యెఱు)గరా మదించి.

54


మాలిని.

విడుఁడు విడుఁడు వీనిన్ విప్రునిన్ భాగ్యవంతున్
మృడుఁడు గరుణతోడన్ మిక్కిలిం గారవించెన్
జడుల కొరుల కేలా సంభవించున్ యథార్థం
బడర మఱి మృ(డానీళానుకం)పాలవంబుల్.

55


గీ.

[3]యజ్ఞదానతపస్సూనృతాదులైన
పుణ్యకర్మం బొనర్చిన పురుషునందు
నెట్లు సంతోషమండు నర్ధేందుమౌళి
యట్టి సంతోష మితనియం దావహించె.

56


వ.

అనిన యమకింకరులు శంకరకింకరుల కిట్లనిరి.

57


సీ.

[4]ఏ కార్యమునకయి యెచ్చోటి కరిగెద
          [5]రరుగుఁడు మీరు మహాత్ములార
యితని క్లేశము చూచి యతికృపాపరతమై
          పు(రుషార్థ మొన)రింప బూనినారె
హరుకింకరుల మన్న నాశ్చర్యమయ్యెడు
          సదసద్వివేకంబు చాలకునికి
భవభక్తులకు నడ్డపడుట ధర్మము మీకు
          నేమేల పట్టుదు మీశుభక్తు-


గీ.

నితఁడు కలుద్రాగె ఱంకాడె [6]నెఱచిఁ దినియె
నిలిచి మూత్రించెఁ జండాలలలనఁ [7]గూడెఁ
గూఁతు రమియించెఁ దెరువాటు గొట్టెఁ బ్రజలం
జెంచురాజుల సేవించెఁ జెఱిచెఁ గులము.

58


సీ.

కేలుదోయెత్తి మ్రొక్కెనె పాశుపతులకు
          శరణార్థి [8]యనియెనే జంగములకు
ఫాలభాగమునందు భస్మంబు పూసెనే
          యఱుతఁ దాలిచెనె రుద్రాక్షపూస
శివమంత్ర ముచ్చరించెనె జిహ్వ [9]తుదయందు
          నరిగెనె యెన్నఁడే నభవుగుడికిఁ
బఠియించెనే మహాప్రమథచారిత్రంబు
          తిరిగెనే మృడుపుణ్యతీర్థములకు


గీ.

[10]దోసములు పెక్కుఁ చేసినఁ జేసెఁ గాని
కాలగళుభక్తి యావంతఁ గలిగెనేని
యడ్డపడ ధర్మమౌఁ [11]గాక యనఘులార
యర్హమే యీ దురాత్మున కడ్డపడఁగ.

59
  1. తా. యాజ్ఞ
  2. ము. దాఁట
  3. ము. అన్నదాన
  4. తా. ఏ కార్యమునకునై
  5. తా. అరుగుడా
  6. తా. సతిని విడియె
  7. తా. గవిసె
  8. ము. ననియెనే
  9. ము. నే ప్రొద్దు
  10. ము. దానములు, పెక్కుఁ జేసినదానఁ గాని
  11. తా. గాన