పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


గుమారశిఖికలాపవిధూననక్రియాలలితంబులుఁ బశుపతిజటాబద్ధవాసుకినిపీతశేషంబులు హేరంబగండమండలనిష్యందమానదానధారాకలుషగంధలహరీ పాణింధమంబులు భృంగిరిటి నికుంభ కుంభోదర ప్రముఖ నిఖిలగణపరిషద్ధూళితభసితధూళికావిసరంబులు [1]మాతృకాశ్రవణావతంసకహ్లారకోరక ప్రేంఖోళనప్రక్రియా సమభిహారానుమేయావతరణంబులు మహిసాక్షి గుగ్గులు ధూపధూమకంబులు మాలూరకిసలయామోద మేదురంబులు నగు మహాదేవనిశామారుతంబు లతనిమీఁద బొలుపారి పాతకంబులు దూల రాల్చె నట్టి సమయంబున.

47


గీ.

అర్ధరాత్రంబుదాఁక నయ్యధమవృత్తి
[2]శివనిశావైభవంబు వీక్షించి చనియెఁ
దానకమునకు నది యాదిగా నతండు
విడిచెఁ దొల్లింటి[3]తన నీచవృత్తిబుద్ధి.

48


వ.

అంతఁ గొంతకాలంబునకు.

49


క.

కుక్కలలో శబరులలో
గక్కెర చిమ్మటలలోనఁ గార్కోళులలోఁ
బక్కణము గుడిసె నడుమను
గుక్కిపయిం జచ్చె నతఁడు ఘోరవ్యాధిన్.

50


క.

శ్రీనాగేశ్వరశంభు-
స్థానంబున [4]గిరిశరాత్రి జాగర మలవో-
కైనను గనుఁగొన్నట్టి క-
తానను విగతాఘుఁడై యతఁడు మృతిఁ బొందెన్.

51


సీ.

క్రిమి కంఠకుహరమార్గమున కడ్డము దొట్టి
          పెద్దయేనియు బాధపెట్టకుండ
శ్లేష్మ ముద్రేకించి సెలవి రంధ్రమువాయ
          మెఱసి నుచ్చిళ్ళు గ్రమ్మింపకుండ
దృగ్గోళకంబులు దిరుగంగఁ[5]బడి దృష్టి
          యంధకారంబులో నణఁగకుండ
నెఱిదప్పి యుచ్ఛ్వాసనిశ్వాసపవమాన-
          పరివాహగతు [6]లోటువడకయుండఁ


గీ.

బరమయోగీశ్వరుఁడు వోలె బ్రహ్మరంధ్ర-
వీథిఁ బ్రాణంబు విడిచె నవ్విప్రకులుఁడు
పుణ్యశివరాత్రి నలవోక వోలెనైన
నురగధరుచెంత జాగరంబుండెఁ గాన.

52


వ.

ఆ కాలంబునఁ గాలకింకరులు మృత్యుదేవతాసహితులై ముసలముద్గర (ఖడ్గ)తోమరాది ప్రహరణంబులతో(డం గదిసి) అతని లింగశరీరంబు వరుణపాశంబుల బంధించుకొనిపోవఁ గణంగిన నవ్వేళ శివదూతలు శివాజ్ఞావశంబున శూలాంకుశగదాభిండివాలపరిఘపరశ్వధ(పాణులై యేతెం)చి దవ్వుల నాకాశమార్గంబున.

53


ఆ.

ఓరి యమునిదూతలార యీ బ్రాహ్మణుఁ
గరుణ మాలి యేల కట్టినారు

  1. తా. భసితదవచితధూళికాధూళిపాళికాసరంబులు
  2. ము. శివు
  3. ము. నీచపువృత్తిబుద్ధి
  4. ము. గిరిశురాత్రి జాగరములు ... ... నను
  5. ము. దృష్టియు
  6. తా. లొంటిబడకయుండ