పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


గాశకుసుమాట్టహాససంగతియుఁ బోలె.

45


ఉ.

ఆ కలకంఠి యొయ్యఁ దడియార్చు నెడన్ జఘనాంతికంబులై
[1]కేకికలాపలీల నణకించి మధువ్రతమాలికాకృతిం
గైకొని యింద్రనీలమణిఖండవిలాసమలిమ్లుచంబులై
చీకటికొల్పె బ్రాహ్మణుని చిత్తము పెన్నెఱిసోగవెండ్రుకల్.

46


గీ.

చికురసంతతి నీరార్చి చెలువ తుఱిమె
సేసకొ ప్పొక(యింత దక్షిణము మలఁగ)
చన్నుఁగవ[2]సొంపు కక్ష[3]దేశముల మెఱుఁగు
బ్రాహ్మణుని యాత్మఁ బల్లవింపంగఁజేయ.

47


గీ.

దంతతాటంకచక్రమధ్యంబునందు
బాల కీలంచెఁ గంకేళిపల్లవంబు
బాడబుని నేయఁదలఁచు శంబరరిపునకుఁ
బ్రథమ మదియ నమస్కారబాణమయ్యె.

48


గీ.

పూనెఁ గుచముల వెలివాడపువ్వుఁబోణి
విప్పుగలయట్టి బండిగుర్వెందసరముఁ
బ్రథమరాగరసోద[4]యరక్తమైన
సచివనందను హృదయజసంగరమున.

49


వ.

అప్పుడు సుకుమారుండు నిజాంతర్గతంబున.

50


సీ.

ఏల చేయండు శేషేంద్రియంబులు నాల్గు
          నలినగర్భుఁడు లోచనములుగాఁగ
నెట్టు గల్గె విధాత కీ రూపనిర్మాణ-
          పరమాణువులు కోటిపరిమితంబు
లజుఁడు దీని సృజించి యాత్మ నువ్విళ్లూర-
          కెట్లుండుఁ గూతు మోహించినాఁడు
కల్పింపఁబోలు శృంగార[5]సర్గంబున
          దీని వాక్పతి [6]యున్నతి ఫలియించె


గీ.

దీని [7]నిఖిలావయవములు తీర్చితీర్చి
చేయునపుడు ప్రయాసంబుఁ జెందుటయును
నొయ్యనొయ్యన బ్రహ్మ నిట్టూర్పువుచ్చె
నదిసుమీ పుష్పసమయమందానిలంబు.

51


వ.

అని విచారిం[8]చుచు విప్రుండు చండాలకులకన్యకా*(మణి) దుర్లభంబగు సౌభాగ్యంబునకు నద్భుతంబందుచు దానితో సంభాషింపఁ గోరి చేరువ [9]నిలిచె జనంగమకన్యకారత్నమును నతని కిట్లనియె.

52


క.

ఎందుండి [10]యేఁగు దెంచితి-
రెం దరిగెద రిచట నునికి కేమి కతంబో
కందర్పరూపరేఖా-

  1. తా. కేకరలోవలీల
  2. తా. నొప్పు
  3. తా. దేశమున
  4. తా. ఆరక్తమైన
  5. తా. సర్వంబున
  6. తా. యున్మది భవించి
  7. తా. యఖిలా
  8. తా. పుచు
  9. తా. నిలిచెదనని చనినం గన్యకా
  10. ము. యరుగుదెంచితి