పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


లీల నేతెంచె నొక్క చండాలకన్య
కొలనఁ జిఱుబంతిపసపాడఁ జెలియుఁ దాను.

32


శా.

ఆ చండాలకులప్రసూతయగు కన్యం గన్యకారత్నముం
జూచెన్ దవ్వుల యాజ్ఞదత్తి విపినక్షోణీవిభాగంబునన్
వాచాగోచరసౌకుమార్యనవలావణ్యాన్వితం బుష్పనా-
రాచుం డిక్షుశరాసనంబు ఘన[1]దోర్దర్పంబునం గూర్పఁగన్.

33


ఉ.

యోగసమాధితత్పరత నున్న విధంబున [2]వ్రాసినట్లు మూ-
ర్ఛాగమ[3]మీలితాత్ముఁడగు చాకృతినిశ్చలదేహయష్టియై
సోగకనుంగొనల్ నుదురు చొక్కుల కిక్కలుగాఁగ నత్తఱిన్
రాగరసాతిరేకమున బ్రాహ్మణుఁ డాదటఁ జూచె మాలెతన్.

34


సీ.

అప్సరస్త్రీ వోలె [4]నకులీనయైన యీ
          పైదలి కన్నులపండువయ్యెఁ
[5]జామ యౌవనరూపసంపన్నయై [6]మోక-
          వనరేఖయునుబోలెఁ బెనఁచె వేడ్కఁ
బొలఁతి [7]ప్రావృడ్వేళ వోలె నళివినీల-
          ఘనవేణియై యిది [8]కరము మెఱసె
నిభరాజనిభయాన యిది [9]శరత్తునుఁ బోలెఁ
          బుండరీకాక్షియై పొలుపు మిగిలె


గీ.

ముట్టరానిదియైనట్టి మూర్తి వోలె
జిత్తరువు వోలె దృష్టి కచ్చెరు వొనర్చె
మెలఁత మధుమాసకుసుమసమృద్ధి వోలె
జాతివిరహిత[10]యయ్యు సంప్రీతి నొసఁగె.

35


గీ.

దీనిఁ గల్పించె నజుఁ డభిద్యానమునను
నాతి మును ముట్టరాకుండ నంత్యజాతి
ముట్టుటయ కల్గెనేని యిమ్ముదితమేను
గందకుండునె పుష్పంబుకంటె మృదువు.

36


వ.

అని [11]విస్మృతనిమేషంబు గిలించి ముకుళితపక్ష్మాంచలంబును జిహ్మ [12]తరతరళశాతోదరంబునునగు వీక్షణంబున నవ్వెలివాడ వ్రీడావతి నీక్షించుచు నవ్విప్రుండు మదనశరశలాకాశంకు[13]సంకలితహృదయుండై స్తంభితుని [14]భంగి విలిఖితుని చందంబున నుత్కీర్ణుని పగిది [15]నియతుని లాగున మూర్ఛితుని ప్రకారంబునఁ (నున్మత్తుని తెఱంగున) దన్నుఁ దానెఱుంగక నివ్వెఱపడి నిశ్చలాంగుండై యుండె నమ్మచ్చెకంటియు నలవోక వోలె నతిస్వచ్ఛసౌభాగ్యచ్ఛాయావినిర్భర్త్సిత మత్స్యకేతనుండగు నా బ్రాహ్మణుం గనుంగొని [16]నిజాంతరంగంబున.

37


గీ.

విప్రవేషంబుఁ దాల్చిన విష్ణుఁడొక్కొ
బ్రాహ్మణుండైన శంబరారాతి యొక్కొ
బాడబాన్వయరూప[17]సంప్రభవుఁడైన
చందురుండొక్కొ యితఁ డతిస్వచ్ఛమూర్తి.

38
  1. ము. దోర్దండంబు
  2. ము. ఁబాసినట్లు
  3. తా. నాకృతిన్ తను వినిశ్చలదృష్టియు దేహయష్టియై
  4. ము. నకులయై యౌర యీ
  5. ము. జారు
  6. తా. మొక
  7. తా. ప్రావృడ్వేళల వోలె నలినాక్ష పయినీల
  8. ము. గరము
  9. ము. శరర్తువువోలె
  10. తా. యయ్యె
  11. ము. విస్తృత
  12. తా. తరళతర
  13. తా. సంకుపిత
  14. తా. విధంబున
  15. తా. సంయతుని
  16. తా. నిజాంతర్గతంబున
  17. తా. సంప్రభవమైన