పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


[1]బనవస్థితి మధుపానం-
బునను సురతమునను సదృశములు వక్త్రంబుల్.

13


గీ.

త్రిసరకాస్వాదభవ మదోద్రేకలహరి
ధరణిదేవుఁ డా యోజ మత్తావహించి
యారణాలు పఠింపంగ నాలకించి
శంబరారాతి రతిచేయి చఱచి నవ్వు.

14


సీ.

ఇంట నున్నాడొ వాఁ డెచ్చోట నున్నాఁడొ
          యొంటియో యెందఱే నున్నవారొ
మిన్నకున్నాఁడొ [2]యేమేఁ బల్కుచున్నాఁడొ
          నిద్రించినాఁడొ కన్దెఱచినాఁడొ
[3]యడలుచున్నాఁడొ (ప్రహర్షింపుచున్నాఁడొ)
          చించిలినాఁడొ గర్వించినాఁడొ
(శోకించినాఁడొ) యుత్సేకించినాఁడొ యు-
          ల్లాసించినాఁడొ కలంగినాఁడొ


గీ.

యుత్సవమొ వైభవమొ లేమియో కలిమియొ
పగలొ రాత్రియొ యెఱుఁగఁ డా బ్రాహ్మణుండు
నవమధూకప్రసూనసంభవపు మధువు
దలము దప్పంగఁ ద్రావి మత్తావహించి.

15


క.

సుకుమారుఁ డిట్లు నానా-
[4]ప్రకరంబుల వీటిలోనఁ [5]బడుచై తిరుగన్
సకలజనులు మొఱవెట్టిరి
యొకనాఁ డత్యాగ్రహమున నుర్వీశు సభన్.

16


క.

దేవర ప్రతినిధిఁగా సం-
సేవింతుము యజ్ఞదత్తు [6]సిద్ధ మతనిఁగా
భావింతుము తత్తనయుని
యౌవనసంప్రాప్తి లేని యటమున్నెల్లన్.

17


వ.

అవధరింపుము సుకుమార నామధేయుండైన మంత్రినందనుండు సౌందర్యవంతుండును గామశాస్త్రకళా[7]విధిజ్ఞుండునునై జారచోరవిటధూర్తవర్గంబులం గూడి వేడుకకాఁడై పుణ్యస్త్రీల [8]యీలువులు చెఱచుచున్న వాఁ డతని వారింపను నారీజనంబుల శిక్షింపను సమర్థులము గాకయున్నార మద్దురాత్మకుని నన్యాయసదృశంబైన దండంబు *(వలన) దండించునది యని విన్నవించిన (నా) మహీపాలుం డతని రప్పించి వాగ్దండనంబున దండించి పురంబును దేశంబును వెడల నడిపించిన రాజావమానితుండై యప్పాపి కీ[క]టదేశంబునకుం బోయి యందుఁ గొన్నిదివసంబు లుండి హూణమండలంబునకు నేతెంచువాఁడు కాంతారమధ్యంబున నతిక్షుత్పిపాసాపరవశుండై తనలో*(న) నిట్లు వితర్కించుచుండె.

18


చ.

అరుణగభస్తిబింబ ముదయాద్రిపయిం [9]బొడతేర గిన్నెలోఁ
బెరుఁగును వంటకంబు వడపిందియ[10]లుం గుడువంగఁబెట్టు ని-

  1. తా. బు
  2. తా. యెమ్మెయిఁ బల్కకున్నాడొ
  3. ము. యాడుచున్నాఁడొ... గర్వించియున్నాఁడొ శోకించినాఁడొ
  4. తా. ప్రకారముల
  5. తా. బరుచై
  6. ము. సిద్ధమ యతనిన్
  7. తా. వంతుండును
  8. ము. నిలువరుసఁ
  9. ము. గనుపట్ట
  10. తా. నుం