పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


గీ.

[1]అష్టమావతారంబున నాదిపురుషుఁ
[2]డచ్యుతుఁడు విశ్వకర్త యనాదినిధనుఁ
డర్జునుండును దాను నేకాంతగోష్ఠి
విశ్వము నెఱుంగ [3]నొగలపై వినిచెఁ గాదె.

8


మ.

బహువేదాంతమతానుసాధిత [4]మహం బ్రహ్మాస్మియం చాడుదుర్
మహి మోహాంధులు గొందఱేని [5]యది బ్రహ్మం బెట్టు [6]దారెట్టిరో
యహహా బ్రహ్మము [7]దారయే నులుకశయ్యం ద్రెళ్ళి నిద్రింతురో
జహదుత్సర్గముగాఁగఁ జేయుదురొ విష్ఠామూత్రనిర్మోక్షమున్.

9


సీ.

కల్పద్రుమంబుతోఁ గామధేనువుతోడ
          నమృతాబ్ధి నవతారమయ్యె నెద్ది
బృందారవనమధ్యమందారతరుల[8]లో
          హలపాణి కెద్ది ప్రత్యక్షమయ్యెఁ
ద్రిపురాంతకుని యర్ధదేహంబునకు నెద్ది
          [9]మదసముల్లాససంపత్తి యయ్యె
నవసుధారూపమై పవనభుగ్భువనాధి-
          పతి కెద్ది ప్రాణంబు ప్రాణమయ్యె-


గీ.

నట్టి భవభేషజము నాసవామృతంబుఁ
గన్నుఁ గానక శపియించెఁ గాక యొకఁడు
తత్సమానములగు పదార్థములు గలవె
భూతభావిభవత్కాలముల ధరిత్రి.

10


వ.*

అని.

11


సీ.

కర్పూరరజము[10]లోఁ గలిపి కేతకీధూళి
          నఖిలాంగకముల నభ్యంగమాడి
జలజనాళీతంతుసందానితములైన
          యజ్ఞోపవీతంబు లఱుతఁ దాల్చి
వారాంగనాస్తన[11]హారవిభూషల
          నక్షమాల్యముగఁ జే నలవకించి
కస్తూరికామిశ్రగంధసారంబున
          నలికంబునఁ ద్రిపుండ్ర మనువుపఱిచి


గీ.

చంద్రికావేళఁ బరిపాండుసౌధవీథి
శక్తిఁ బూజించి దేవీప్రసాదమధువు
పుచ్చుకొను విప్రుఁ డాకంఠపూరితముగ
వెలఁదులును దాను నప్పుడు వినిమయముల.


క.

వనితల [12]కంగప్రేంఖో-
ళన మక్షివిఘూర్ణనంబు లజ్జావిగమం-

  1. తా. అష్టమాది తోరంబున
  2. తా. డవ్యయుఁడు విశ్వకర్తయనుట నిధను
  3. ము. మొ ... ... నిధిగా; తా. మొగలిపూవిరిసెఁ గాదె
  4. తా. బ్రహ్మాస్మియం చాదురే; ము. మహాబ్రహ్మాహమం
  5. ము. యటె
  6. తా. దారెట్టిదో, లహహా
  7. ము. వారయే
  8. తా. తో
  9. ము. మదనసంఫుల్ల
  10. తా. తోఁ గలియు
  11. తా. తారహారవిభూష యక్షమాల్యముగ
  12. తా కంగంప్రేంఖో; ము. కంగప్రక్షా