పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


[1]యనఁగ దానికి నిష్కృతి యాచరింప.

33


గీ.

[2]అపరతంత్రుండవని చెప్ప నాగమములు
నిగమములు నీక చెప్పుదు నీలకంఠ
యీ దురాత్ముని కతన నీ కెఱుకపడితి
[3]నపరతంత్రుండవైతి మా కందఱకును.

34


వ.

అని దండప్రణామంబు చేసి కరకమలంబులు మొగిడ్చి నిలిచియున్నఁ గనుంగొని మందస్మితసుందరవదనారవిందుండై యిందుధరుం డిట్లనియె.

35


సీ.

మకరరాశిస్థుఁడై మార్తాండు డుండంగ
          సమకొన్న మాఘమాసంబునందు
సితచతుర్దశినిశి శివరాత్రి యను పేరం
          బ్రఖ్యాతిగనిన యా రాత్రియందు
[4]నట్టి నాల్జాలును నవధానపరత[5]మై
          జాగరవ్రతచర్య జరుపవలయు
నా జాగరవ్రతం బనఘప్రాజాపత్య
          సత్ఫలం బీనోపు సాధకునకు


గీ.

నవనిసురుఁడాది చండాలుఁ డాదిగాఁగ
నీ వ్రతము సేయఁగా నర్హు లెల్లవారు
నన్ని చందాల నీ వ్రతం బలఘుఘోర-
పాతకంబుల నెల్లఁ గాల్పంగఁ జాలు.

36


శా.

జ్ఞానాజ్ఞానకృతంబులయ్యుఁ బశుహింసాబ్రహ్మహత్యాసురా-
పానస్తేయము లాదిగాఁ గలుగు పాపంబుల్ దహించున్ నిమే-
షానన్ శంభునిశావ్రతంబు ప్రబలజ్వాలావృతం బగ్ని [6]యె-
ట్లేనిం గాలుచు నార్ద్రశుష్కముల నొక్కిం తిధ్మభారంబులన్.

37


వ.

ఈ సుకుమారుండు.

38


గీ.

మకరరాశిస్థుఁడై (యంశుమాలి) యుండ
మాఘ(కృష్ణ)చతుర్దశి (మధ్య)రాత్రి
నన్నుఁ (బూజింప) [7]వీక్షించినాఁడు జను(లు)
(నట్టి)(కతమున) (పు)(ణ్యాత్ముఁ)డయ్యె నితఁడు.

39


వ.

అదియును.

40


గీ.

కూతుఁ జండాలి నాలిఁగాఁ గోరి రాత్రి
పుష్పములు గోయ నేతెంచి పువ్వుఁదోఁట
పార్శ్వమున నుండఁ గాంచె నా భక్తజనులు
నన్నుఁ బూజించి జాగరణ(ంబు) సేయ.

41


సీ.

తీర్థమాడింపంగ దివ్యాంబరము గట్టి
          చందనం బలఁదఁ బుష్పములు పూన్ప

  1. తా. యనుని; ము. యగునె
  2. తా. అవిర
  3. వపర
  4. తా. నాటి
  5. తా. యై
  6. తా. య
  7. తా. వీక్షించునాఁడు