పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మ.

అవుఁగాకేమి జగజ్జనిస్థితిలయవ్యాపారపారంగతుం-
డవు నీ లెంకలచేత శిశుఁబడు టెగ్గా మద్భటశ్రేణి కీ
యవినీతాత్మునకై పిశాచమునకై యాభాసదుర్బ్రాహ్మణ-
బ్రువచండాలునకై [1]పెనంబడుటకై భూతేశ సిగ్గయ్యెడిన్.

29


సీ.

ముట్టైన చండాలి [2]ముట్టెనో ముట్టఁడో
          యడుగంగరాదె యీ యధమజాతి
నన్యకామినుల ఱంకాడెనో యాడఁడో
          యడుగంగరాదె యీ యధమజాతి
త్రావెనో త్రావఁడో [3]తాళ్ళ హాలారసం
          బడుగంగరాదె యీ యధమజాతి
గారాపుఁగన్నియఁ గవిసెనో కవియఁడో
          యడుగంగరాదె యీ యధమజాతి


గీ.

రాజరేఖావిభూషణా! రాజసంపు
[4]తప్పు దండువు లేకుంట తథ్యమయ్యె
నిట్టి పాపాత్ము సర్వలోకేశ్వరుండు
[5]వెనుక నిడుకొన్న మాకు నేమనఁగ వచ్చు.

30


గీ.

ప్రమథు లవనిసురుని మేన బంధ మూడ్చి
వరుణపాఠంబు లెచ్చోట వైచినారొ
యరసి తెప్పించు వానిఁ జంద్రావతంస
నాకు నెర విచ్చినాఁ డంబునాయకుండు.

31


సీ.

జలధరంబులనుండి స్రవియించు జలధార
          లెన్నవచ్చిననేని యెన్నవచ్చు
గగనమండలిఁ దారకాచక్రవాళంబు
          లెన్నవచ్చిననేని యెన్నవచ్చు
భాగీరథీమహాపగలోని సికతంబు
          నెన్నవచ్చిననేని యెన్నవచ్చుఁ
గలశపాథోరాశికల్లోలమాలిక
          లెన్నవచ్చిననేని యెన్నవచ్చుఁ


గీ.

గాని నరునకు నెన్నశక్యంబుగావు
పాయకీతండు చేసిన పాతకములు
భర్గ యేమని విన్నపింపంగ నేర్తు
నిట్టి పాపాత్ముఁ బొడఁగాన [6]మెన్నఁడేని.

32


గీ.

ఎన్ని శాస్త్రంబు లీక్షించియేని నేరఁ-
డెట్టి విద్వాంసుఁడైన నర్ధేందుమౌళి
యితఁడు చేసిన పాతకం బింతటిదియ

  1. తా. పెనుంబడుటకై
  2. తా. ముట్టునో
  3. తా. త్రాళ్ళ
  4. తా. తప్పుతండువు
  5. తా. వెనక
  6. తా. మెన్నండూ