పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మ్రొక్కి హస్తసరోరుహంబులు మొగిడ్చి
వినయ మొప్పఁగ నిట్లని విన్నవించె.

12


సీ.

ఓ జగన్నాథ యో యుడురాజశేఖర
          యో కృపాంభోరాశి యో త్రినేత్ర
యో విష్ణుధాత్రాది దేవతాకోటీర
          పరిచిత శ్రీపాదపద్మయుగళ
యో జలంధరవైర యో గంధకరికృత్తి-
          [1]కంథాధురంధర స్కంధపీఠ
యో నీలలోహిత యో లలాటాంబక-
          జ్వలనజిహ్వాదగ్ధశరభచిహ్న


గీ.

దక్షిణాశాధిపతి దండధరుఁడు దాను
చిత్రగుప్తుండు దేవర సేవ సేయ
నరుగుదెంచినవాఁడు తే నవసరంబు
ననువుపడ దుండుమందమో యానతిమ్ము.

13


వ.

అని పలికి శివుని ముఖప్రసాదంబు నింగితం బెఱింగి నందికేశ్వరుండు తన్నుం బ్రవేశింపంజేయఁ జిత్రగుప్తసహితుండై చనువాఁడు ముందట.

14


సీ.

దేవదేవుని పూర్వదిగ్భాగమునయందుఁ
          పరమ(మా)హేశులఁ బాశుపతుల
[2]... ... ... ... ... ... ... ... ... ... ...
          ... ... ... ... ... ... ... ... ... ... ...
... ... ... ... ... ... ... ... ... ... ...
          ... ... ... ... ... ... ... ... ... ... ...
... ... ... ... ... ... ... ... ... ... ...
          ... ... ... ... ... ... ... ... ... ... ...


గీ.

వికటపాటలఘనజటామకుటకోటి-
ఘటిత కుటిలశశాంకరేఖాకలాప
భూషితులఁ జతుర్బాహుల భూరిబలుల
శ్రాద్ధదేవుండు చూచి విస్మయముఁ బొందె.

15


గీ.

దక్షిణంబున వీక్షించె దండపాణి
యజునిఁ బాండురపుండరీకాసనస్థు
నంగిరోవామదేవకణ్వాక్షపాద
కపిలసనకవసిష్ఠాది గణముతోడ.

16


సీ.

బ్రాహ్మి [3]మాహేశ్వరి వారాహి కౌమారి
          చాముండ యైంద్రి వైష్ణవి యనంగ

  1. తా. కంఠా
  2. ఈపాదములకు సరిపోవునంత స్థలము తాళపత్రమున ఊరక విడువబడినది
  3. తా. మాహిషి