ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చ. ఎదిరిమనంబు నోవనటు లెంతయు నింపుగఁ బల్కు వారలం
బదుగురు గారవింపుదురు; ప్రల్ల దులం దరిఁ జేరనిత్తురే?
ముదమునఁ గీరశారికల ముద్దుగఁబంజరమందు నుంచి పెం
చెద; రలకాకులం జెదరఁ జేయ రె చీఁదరఁ జెంది ? మిత్రుఁడా!
చ. సమయ మెఱింగి పల్కు విలసన్మృదువాక్కులు వోలేఁ దీవ్రవా
క్యము లొనరింపనేర వొడికంబుగఁ గార్యపుసిద్ధి; నెట్లనం,
బ్రమద మెసంగ రాల్చును బ్రభాతపుశీతలవాత పోతముల్
సుమఫలముల్ ; శలాటువుల డుల్చునుగా పెనుగాలి! మిత్రుఁడా!
చ. వ్యపగతమార్దవంబులు మహాప్రియముల్ సమయానుకూల మౌ
లపితము, లట్లుకాని మృదులంబులు నప్రియముల్ నుడుల్; ప్రభా
తపుఁదఱిఁ గాక కుక్కుటరుతంబు హితం బగు నెంతయన్; వియో
గపు సమయంబునన్ శుకపికస్వర మార్తికరంబు; మితుడా!
61